జీడికల్ రోడ్డుకు మరమ్మతులు
లింగాలఘణపురం: మండల పరిధి జీడిక ల్ శ్రీవీరాచల రామచంద్రస్వామి ఆల య ప్రాంగణంలో సుమారు కిలోమీటరు రోడ్డుకు మరమ్మతు పనులను అధి కారులు చేపట్టారు. ఈనెల 14 నుంచి జీడికల్ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయానికి వచ్చే రోడ్లు అధ్వానంగా ఉండడంతో ‘జాతరొస్తోంది.. రోడ్లు బాగు చేయండి’ శీర్షికన ఈనెల 4న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటీవల సమీక్ష సమావేశంలో జీడికల్ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగొద్దని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జీడికల్ ఆటో స్టాండ్ నుంచి దుర్గమ్మ గుడి వరకు గుంతలమయమైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. అలాగే గతంలో సీఎస్ఆర్ ఫండ్స్‌తో ఆలయ ప్రాంగణంలో వేసిన గ్రానైట్ రోడ్డు మధ్య ఎర్రమట్టి పోస్తున్నారు. జాతర ఏర్పాట్లపై డీపీఓ స్వరూప, ఆర్డీఓ గోపి, ట్రాన్స్‌కో ఎస్ఈ వేణుమాధవ్, ఏసీపీ బీమ్శర్మ తదితరులు పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment