దళితబంధు పథకం కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

దళితబంధు పథకం కొనసాగించాలి

Published Sat, Nov 9 2024 1:04 AM | Last Updated on Sat, Nov 9 2024 1:04 AM

దళితబంధు పథకం కొనసాగించాలి

దళితబంధు పథకం కొనసాగించాలి

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

జనగామ: దళితుల అభ్యున్నతికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన దళితబంధు పథకాన్ని ప్రస్తుత సర్కారు కొనసాగించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ స్కిల్‌ డెవలప్మెంట్‌ పథకం కింద గీతాఫౌండేషన్‌ ఆధ్వర్యాన శుక్రవారం జిల్లా కేంద్రం ధర్మకంచలోని అంబేడ్కర్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్లు, శిక్షణ సర్టిఫికెట్లను ఆయన అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితబంధు కొనసాగిస్తే వారు మరింత ఆర్థికంగా బలోపేతం అవుతారని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి తోచిన విధంగా ఆర్థిక సహాయం, హైదరాబాద్‌ నీలిమా ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆర్డర్లను కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు ఇస్తే ఆర్థిక వెసలుబాటు కలుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పి.జమునలింగయ్య, కోఆప్షన్‌ సభ్యులు మసిఉర్‌ రెహమాన్‌, కౌన్సిలర్లు గాదెపాక రాంచందర్‌, అనిత, సువార్త, బొట్ల శ్రీనివాస్‌, ప్రవీణ్‌, ఉల్లెంగుల సందీప్‌, తిప్పారపు విజయ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement