సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం
● నేటి నుంచి ఇంటింటా వివరాల సేకరణ
● 98.13 శాతం స్టిక్కరింగ్ పూర్తి
జనగామ: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నేటి(శనివారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఇళ్లకు స్టిక్కర్లు వేసిన ఎన్యుమరేటర్లు.. సర్వేకు సర్వం సిద్ధం చేసుకున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా పర్యవేక్షణలో అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్, ఆయా శాఖల ఉన్నతాధికారుల ఆధ్వర్యాన సర్వే విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,62,512 గృహాలు ఉండగా మూడు రోజులుగా 1,58,495 ఇళ్లకు (98.13శాతం) స్టిక్కర్లు వేశారు. సమగ్ర సర్వే కోసం 1,159 బ్లాక్‌లుగా విభజించి 1,159 మంది చొప్పున ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లను కేటాయించారు. ప్రభుత్వం ఇచ్చిన ఫార్మెట్ ప్రకారం కుటుంబ సర్వే ఎలా చేపట్టాలనే దానిపై ముందుగానే శిక్షణ ఇచ్చినప్పటికీ ఇబ్బందులు ఏర్పడితే సర్వేకు ఆటంకం కలుగకుండా రిజర్వుగా మరికొంతమందిని సిద్ధంగా ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment