పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
డోర్నకల్: మానుకోట జిల్లా డోర్నకల్ రైల్వే జంక్షన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో శుక్రవారం గూడ్స్ రై లు పట్టాలు తప్పింది. విజయవాడ నుంచి భద్రాచలం రోడ్డు వైపు వెళ్తున్న గూడ్స్ రైలు డోర్నకల్ జంక్షన్ మెయిన్ లైన్ నుంచి బైపాస్ లైన్ మార్గంలో భద్రాచలం రోడ్ వైపు వెళ్తుండగా బైపాస్ మార్గంలో రైలు 17, 18, 19వ బోగీలు పట్టాలు తప్పాయి. బోగీలు ఖాళీగా ఉండడంతో మూడింటిలో ఒకటి పట్టాలకు అడ్డంగా నిలువగా రెండు బోగీలు పట్టా లు తప్పాయి. సమాచారం అందుకున్న స్టేషన్ సూ పరింటెండెంట్ శోభన్‌ప్రసాద్‌తోపాటు వివిధ విభా గాల అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘట నాస్థలానికి చేరుకుని పట్టాలు తప్పిన బోగీలను ట్రాక్‌పైకి తెచ్చే చర్యలు చేపట్టారు. బైపాస్ రోడ్డులో ప్రమాదం జరగడంతో విజయవాడ–వరంగల్, డోర్నకల్– భద్రాచలం మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం లేదని రైల్వే అధికారులు తెలిపారు.
ఏయార్టి ట్రైన్ సిబ్బంది సహకారం
కాజీపేట రూరల్: డోర్నకల్ రైల్వే స్టేషన్ బైపాస్ సైడింగ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్లను యధాస్థితికి తీసుకొచ్చేందుకు కాజీపేట జంక్షన్ నుంచి శుక్రవారం రాత్రి యాక్సిడెంట్ రిలీఫ్‌ట్రైన్ (ఏయార్టి) ప్రత్యేక రైలు సిబ్బంది తరలివెళ్లారు. వ్యాగన్‌లు పట్టాలు తప్పిన సమాచారాన్ని కాజీపేట రైల్వే అధికారులు ఎలక్ట్రిటిక్ ఎమర్జెన్సీ సైరన్ మోతలతో కాజీపేటలోని ఎమర్జెన్సీ బ్రేక్ డౌన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
డోర్నకల్ రైల్వేజంక్షన్ పరిధిలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment