వేసవిలో నాణ్యమైన విద్యుత్
● ఇప్పటికే సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఖరారు
● 29న నోడల్ ఆఫీసర్ల సమీక్ష
హన్మకొండ: వేసవిలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క విద్యుత్ సంస్థల సీఎండీలు, అధికారులతో సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించారు. వేసవిలో మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఈ నెల 29న అన్ని సర్కిళ్లలో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎన్పీడీసీఎల్‌లోని 16 సర్కిళ్లకు నోడల్ అధికారులుగా సీజీఎంలను నియమించారు. హనుమకొండ సర్కిల్ (జిల్లా)కు చీఫ్ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్‌డీ) టి.మధుసూదన్, వరంగల్ సర్కిల్ (జిల్లా)కు చీఫ్ జనరల్ మేనేజర్ రాజు చౌహా న్‌ను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. వీరు బుధవారం ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్ అధికారులతో సర్కిల్ కార్యాలయాల్లో సమీక్ష నిర్వహిస్తారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో చేపట్టిన పనులు, పూర్తయినవి, పురోగతిలో ఉన్న వాటిపై సమీక్షించి మిగతా పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు.
సమ్మక్క జాతరకు ఆహ్వానం
కన్నాయిగూడెం : మండలంలోని ఐలాపూర్ గ్రామంలో ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో నిర్వహించే సమ్మక్క– సారలమ్మ జాతరకు ఏటూరునాగారం ఐటీడీఓ పీఓ చిత్ర మిశ్రాకు పూజారులు, ఆదివాసీ నాయకులు సంయుక్తంగా ఆహ్వానపత్రం ఆందజేశారు. పీఓను కలిసిన వారిలో పూజారుల సంఘం అధ్యక్షుడు మల్లెల రవి, పీరీల భాస్కర్, పులిష బాలు, తిరుపతి, సురేశ్, పోడెం బాబు, ఆలం రాంబాబు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment