216 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
గూడూరు : ఓ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన రూ. 7.12 లక్షల విలువైన 216 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు ఓ లారీ, రెండు ద్విచక్రవాహనాలను పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్‌రావు మంగళవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజ్‌పల్లిలోని రాజరాజేశ్వరి రైస్ మిల్లు యజమాని భూక్య నవీన్ కొంతకాలంగా అక్రమంగా రేషన్ బియ్యం వ్యాపారం కొనసాగిన్నాడు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన రూ. 7.12 లక్షల విలువైన 216 క్వింటాళ్ల (432 బస్తాలు) రేషన్ బియ్యాన్ని లారీలో లోడ్ చేస్తున్నాడు. అలాగే, ఇద్దరు వ్యక్తులు గ్రామాల్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని ద్విచక్రవాహనాలపై మిల్లుకు తరలిస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్, జిల్లా సివిల్ సప్లై అధికారులు వెంటనే గ్రామానికి చేరుకుని మిల్లులో తనిఖీ చేపట్టి రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని కేసముద్రంలోని గిడ్డంగికి తరలించారు. అనంతరం రెండు ద్విచక్రవాహనాలు, లారీని గూడూరు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో మిల్లు సీజ్ చేసి యజమానిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఓఎస్డీ ప్రభాకర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ స్పెషల్ ఆఫీసర్ (హైదరాబాద్) లక్ష్మారెడ్డి, జిల్లా సివిల్ సప్లై అధికారి ప్రేమ్‌కుమార్, ఎస్సై గిరిధర్‌రెడ్డి, ఎంఆర్‌ఐ మల్లయ్య, ఏఎస్‌ఓ రమేశ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అప్పరాజ్‌పల్లిలోని రాజరాజేశ్వరి
రైస్ మిల్లులో ఘటన
Comments
Please login to add a commentAdd a comment