అస్తవ్యస్తంగా ఎస్సారెస్పీ కాల్వలు
డోర్నకల్: డోర్నకల్, సీరోలు మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఎస్సారెస్పీ కాల్వలు పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలు, బండరాళ్లతో మూసుకుపోయాయి. కొన్ని సంవత్సరాలుగా కాల్వలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు.
ఆక్రమణలు..
టేకులతండా, వెన్నారం, జోగ్యాతండా లాంటి ప్రాంతాల్లో కాల్వలు ఇరుపక్కలా ఆక్రమణలకు గురయ్యాయి. టేకులతండా, వెన్నారం, తెల్లబండతండా, చిలుకోడు, చిలుకొయ్యలనాడు ప్రామాల శివారులోని కాల్వల్లో చెట్లు, పిచ్చి మొక్కలు, వ్యర్థాలు పేరుకుపోవడంతో మూసుకుపోయాయి.
గతంలో గండి..
కాల్వల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో గతంలో జో గ్యాతండా వద్ద కాల్వలకు గండి పడి రోడ్డుపైకి నీరు ప్రవహించింది. టేకులతండా సమీపంలో ఎస్సారెస్పీ కాల్వ మట్టిని గుర్తు తెలియని వ్యక్తులు తోడుకెళ్లారు. దీంతో కాల్వ స్థలాన్ని పక్క రైతు ఆక్రమించాడు. చాలా ప్రాంతాల్లో కాల్వలకు ఇరువైపులా స్థ లాలను రైతులు ఆక్రమించి తమ పొలాల్లో కలుపుకున్నారు. కాగా వారంక్రితం కాల్వలకు నీటిని వది లారు. కాల్వలు ధ్వంసం కావడంతో నీటి ప్రవాహా నికి అంతరాయం ఏర్పడుతోంది. కాల్వలు అస్తవ్యస్తంగా మారడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కాల్వల మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
పిచ్చి మొక్కలు, ముళ్లకంపలతో
నిండిన కాల్వలు
చివరి ఆయకట్లు రైతుల పొలాలకు
అందని సాగునీరు
Comments
Please login to add a commentAdd a comment