నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి

Published Thu, Jan 30 2025 1:50 AM | Last Updated on Thu, Jan 30 2025 1:50 AM

-

మహబూబాబాద్‌ అర్బన్‌: జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ నాలుగో మహాసభ జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల రాజు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విద్యారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, విద్యలో మతోన్మాద భావాజాలన్ని ప్రేరేపించే విధంగా బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యపై చిన్న చూపుచూస్తుందని, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడుతుందన్నారు. గిరిజన జిల్లా అయిన మానుకోటపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి సమస్యలు పరి ష్కారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ పట్ల మధు, కో కన్వీనర్‌ గుగులోత్‌ సూర్యప్రకాష్‌, జిల్లా నాయకులు రాజేష్‌, రాకేష్‌, సంజయ్‌, మహేష్‌, వినోద్‌, చందు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

తెగుళ్ల నివారణపై

అవగాహన

కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో వరి పంటలకు సోకుతున్న తెగుళ్ల నివారణపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వరిలో సోకుతున్న చీడపురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మల్యాల కేవీకే శాస్త్రవేత్త మాలతి వివరించారు. కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ డైరెక్టర్‌ సంకు శ్రీపాల్‌రెడ్డి, పొదిల నర్సింహరెడ్డి, క్రీబ్‌ కో సంస్థ రాష్ట్ర మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామకృష్ణయ్య, శాగంటి శ్రీనివాస్‌, బండి శ్రీనివాస్‌, బండి వెంకన్న, కుమారస్వామి పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకు శిక్షణ

మహబూబాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ, జెడ్పీహెచ్‌ఎస్‌, మోడల్‌ స్కూల్‌, కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లోని ఒక్కో ఉపాధ్మాయయుడికి ఈ నెల 30, 31న జిల్లా కేంద్రంలోని ఏకశిల హోలిఏంజిల్స్‌ హైస్కూల్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ రవీందర్‌రెడ్డి బుధవారం అన్నారు. ఉదయం 9 గంటలకు విద్యార్థుల కెరీర్‌ గైడెన్స్‌ కౌన్సెలింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతీ పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఈ శిక్షణకు హాజరుకావాలని, దీనికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

బస్సు సర్వీసు ప్రారంభం..

నెహ్రూసెంటర్‌: మహబూబాబాద్‌ నుంచి కేసముద్రం, గూడూరు మీదుగా నర్సంపేటకు ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్సు సర్వీసును ప్రారంభించినట్లు ఆర్టీసీ డీఎం ఎం. శివప్రసాద్‌ బుధవారం తెలిపారు. మహబూబాబాద్‌ ఉదయం 7 గంటలకు బయల్దేరి కేసముద్రం, అర్పనప్పల్లి, తీగలవేణి, బొల్లెపల్లి మీదుగా గూడూరుకు చేరుకుని అక్కడి నుంచి నుర్సంపేట 9.20 గంటలకు చేరుకుంటుందన్నారు. సాయంత్రం 4.45 గంటలకు నర్సంపేటలో బయల్దేరి 6.36 గంటలకు మహబూబాబాద్‌కు చేరుకుంటున్నారు. నూతన బస్సు సౌకర్యాన్ని ప్రజలు, ప్రయాణికులు వినియోగించుకుని, ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కోరారు.

శిశు విక్రయ కలకలం..!

మానుకోట ప్రభుత్వ

జనరల్‌ ఆస్పత్రిలో ఘటన

అలాంటిదేమీ లేదన్న ఆర్‌ఎంఓ

నెహ్రూసెంటర్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో నవజాత (ఆడ) శిశు విక్రయం కలకలం రేపింది. శిశువును విక్రయానికి ప్రయత్నిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో బుధవారం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే... కొత్తగూడకు చెందిన ఓ మహిళ రెండో కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 27న అడ్మిట్‌ అయింది. వైద్యులు ఆపరేషన్‌ చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు అంతకుముందే ఒక కూతురు ఉండగా రెండో కాన్పులో కూడా ఆడశిశువే పుట్టడంతో కొంత అసంతృప్తికి గురైంది. ఇదివరకే భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నాయి. రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని, ఎవరికై న దత్తత ఇద్దామా అని భార్యతో భర్త చెప్పాడు. ఈ విషయం కాస్త శిశువును విక్రయిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై ఆస్పత్రి ఆర్‌ఎంఓ జగదీశ్వర్‌ను వివరణ కోరగా తల్లిదండ్రులతో మాట్లాడి దత్తత ఇవ్వాలనుకుంటే చట్ట ప్రకారం వెళ్లాలని తెలిపామన్నారు. ఎలాంటి శిశు విక్రయం జరగలేదని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement