మోగిన నగారా.. | - | Sakshi
Sakshi News home page

మోగిన నగారా..

Published Thu, Jan 30 2025 1:50 AM | Last Updated on Thu, Jan 30 2025 1:50 AM

మోగిన నగారా..

మోగిన నగారా..

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న వరంగల్‌–నల్ల గొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్‌ బుధవారం షెడ్యూల్‌ ప్రకటించింది. ఎమ్మెల్సీగా ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీకాలం మార్చి 29న ముగియనుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల జాబితాను సిద్ధం చేయగా.. ఎమ్మెల్సీ రేసులో ఉన్న ఆశావహులు ప్రచారం సాగిస్తున్నారు.

వచ్చే నెల 3న నోటిఫికేషన్‌...

అమల్లోకి ఎన్నికల కోడ్‌...

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వచ్చే నెల 3న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే రోజు నుంచి అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేయాల్సి ఉండగా.. 10వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఆ రోజు వరకు దాఖలైన నామినేషన్‌లను ఎన్నికల అధికారులు 11న పరిశీలించనుండగా, 13న నామినేషన్‌ల ఉపసంహరణ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ.. పోలింగ్‌కు మధ్య సుమారు 14 రోజుల సమ యం ఉండనుండగా, ఒక్కరోజు ముందే ప్రచారాన్ని ముగించా ల్సి ఉంటుంది. ఈ మేర కు అభ్యర్థులు ప్లాన్‌ చేసుకోవాల్సి ఉండగా.. 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ఉంటుంది. మార్చి 3న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌లో పేర్కొంది. బుధవారంనుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని వెల్లడించారు.

12 జిల్లాలు, 24,905 మంది ఓటర్లు...

వరంగల్‌ – నల్లగొండ – ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 12 జిల్లాలు, 191 మండలాలకు చెందిన 24,905 మంది ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 200 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు ఇదివరకే ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం టీఎస్‌యూటీఎఫ్‌ నేత అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ముందు పూల రవీందర్‌, చుక్కారామయ్య ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఎన్నికల్లో నర్సిరెడ్డి మరోసారి బరిలో నిలవనుండగా ఇండిపెండెంట్‌గా ‘కుడా’ మాజీ చైర్మన్‌ ఎస్‌.సుందర్‌రాజు, వివిధ ఉపాధ్యాయసంఘాల నుంచి పులి సరోత్తమరెడ్డి, పింగిళి శ్రీపాల్‌రెడ్డి, పూల రవీందర్‌, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, సాయిరెడ్డి, కస్తూరి సాయిచరణ్‌తో పాటు పలువురు ప్రచారం మొదలెట్టారు.

ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌..

అదేరోజు నుంచి 10 వరకు

నామినేషన్లు

11న నామినేషన్ల పరిశీలన..

13న ఉప సంహరణ...

27న పోలింగ్‌... మార్చి 3న

ఓట్ల లెక్కింపు... ఫలితాలు

ఇప్పటికే ప్రచారం మొదలెట్టిన

ఆశావహులు

వరంగల్‌ –ఖమ్మం–నల్లగొండ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య...

జిల్లా మండలాలు పోలింగ్‌ పురుషులు సీ్త్రలు మొత్తం

కేంద్రాలు

సిద్దిపేట 04 04 120 43 163

జనగామ 12 12 556 365 921

హనుమకొండ 11 15 2884 2214 5098

వరంగల్‌ 13 13 1381 844 2225

మహబూబాబాద్‌ 18 16 1083 535 1618

భూపాలపల్లి 07 07 211 112 323

ములుగు 09 09 394 218 612

భద్రాద్రి 23 23 1038 941 1949

ఖమ్మం 21 24 2300 1655 3955

యాదాద్రి 17 17 595 326 921

సూర్యాపేట 23 23 1690 947 2637

నల్లగొండ 33 37 2688 1795 4483

మొత్తం 191 200 14,940 9,995 2,4905

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement