పోలీసుల అదుపులో ఉపాధ్యాయులు
తొర్రూరు రూరల్: తొర్రూరు మండలం అరిపిరాల గ్రామ ఉన్నత పాఠశాలలో కొంత మంది ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రులు, యువజన సంఘాల నాయకులు బుధవారం ఆందోళనకు దిగారు. సదరు ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. కొట్టే ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న తొర్రూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తల్లిదండ్రులు, యువకులకు సర్ది చెప్పారు. ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం విద్య, పోలీస్‌శాఖ అధికారులు బాధిత విద్యార్థినులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఎవరు ఇబ్బందులు పెడుతున్నారని, అసభ్యంగా ఎంతమంది ఉపాధ్యాయులు ప్రవర్తిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈవిషయమై పోలీస్, విద్యాశాఖ అధికా రులను వివరణ కోరగా బాధితులనుంచి త్వరలో ఫిర్యాదు తీసుకుని అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులను గుర్తిస్తామన్నారు.కేసు కూడా నమోదు చేసి, రిమాండ్‌కు పంపండంతోపాటు శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తల్లిదండ్రులు, యువజన సంఘాల నాయకుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment