కొనసాగుతున్న రైల్వే మూడోలైన్ పనులు
కేసముద్రం: కేసముద్రం రైల్వేస్టేషన్ సమీపంలో అండర్ డ్రెయినేజీ వద్ద 2024, నవంబర్ 26న రైల్వే థర్డ్‌లైన్ పనులు మొదలుపెట్టారు. కాగా అండర్ డ్రెయినేజీ నుంచి రైల్వేట్రాక్‌కు ఇరువైపులా ద్విచక్ర వాహనాదారులు, బాటాసారులు రాకపోకలు సాగించగా.. ప్రస్తుతం చేపడుతున్న పనులతో రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ద్విచక్రవాహనాదారులు ఫ్లైఓవర్బ్రిడ్జి మీదుగా 3 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇక బాటాసారులు రైల్వేట్రాక్ దాటుతూ, గూడ్సురైళ్లు నిలిచినప్పుడు, వాటి కింది నుంచి ఇబ్బందులు పడుతూ, దాటుతున్నారు. కాగా అండర్ డ్రెయినేజీ వద్ద పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
అండర్ డ్రెయినేజీ నుంచి
నిలిచిపోయిన రాకపోకలు
రైల్వేట్రాక్ దాటేందుకు ప్రజల అవస్థలు
Comments
Please login to add a commentAdd a comment