గురువారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 2025

Published Thu, Jan 30 2025 1:50 AM | Last Updated on Thu, Jan 30 2025 1:50 AM

గురువ

గురువారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 2025

‘మానుకోట మండలం అమనగల్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించగా.. ఎక్స్‌రే తీయించుకోవాలని సూచించారు. ఈమేరకు ఎక్స్‌రే విభాగానికి వెళ్లగా.. ఈరోజు ఎక్స్‌రే తీయడం కుదరదని, మరోరోజు రావాలని లేదా బయటకు వెళ్లి తీయించుకోమని టెక్నీషియన్స్‌, సిబ్బంది సూచించారు. దీంతో సదరు వ్యక్తి ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లి ఎక్స్‌రే తీయించుకున్నాడు.’

నెహ్రూసెంటర్‌: జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రోగులకు సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఎక్స్‌రే, స్కానింగ్‌, సీటీ స్కానింగ్‌ సేవలు పూర్తి స్థాయిలో అందడంలేదు. పేదలకు మెరుగైన వైద్యం అందించానే ఉద్దేశంతో ఆస్పత్రిలో ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి డయాగ్నోసెంటర్‌ను ఏర్పాటు చేశారు. కావాల్సిన స్కానింగ్‌, ఎక్స్‌రే, సీటీ స్కానింగ్‌, టూడిఎకో వంటి పరికరాలను అందుబాటులో ఉంచారు. అయితే అధికా రుల నిర్లక్ష్యం, సిబ్బంది పట్టింపులేనితన వల్ల సేవలు అంతంత మాత్రంగానే అందిస్తూ ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. కేవలం ఓపీ సమ యం వరకే ఎక్స్‌రే తీస్తామని, అనంతరం ప్రైవేట్‌ వెళ్లి తీసుయించుకోవాలని సిబ్బంది సూచించండం గమనార్హం. ప్రతీరోజు ఎక్కువ సంఖ్యలో స్కానింగ్‌ తీయడం ద్వారా మా ఆరోగ్యాలు దెబ్బతింటాయని టెక్నీషియన్లు చెప్పడం కొసమెరుపు.

మధ్యాహ్నం వరకే సేవలు...

ఆస్పత్రికి వచ్చే రోగులకు ప్రతీరోజు ఎక్క్‌రే, సీటీస్కాన్‌, టూడిఎకో, ఈసీజీ సేవలను అందించాలి. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, ఓపీ సమయంలో మాత్రమే రోగులకు కొన్ని సేవలను మాత్రమే అందిస్తున్నారు. మిగిలిన రోగులకు మరుసటి రావాలని లేదా ప్రైవేట్‌కు వెళ్లాలని సిబ్బంది సూచిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

వేధిస్తున్న కొరత...

ఆస్పత్రిలో సుమారు 10మంది టెక్నీషియన్లు అవసరం ఉండగా.. ఇద్దరు మాత్రమే ఉన్నారు. అత్యాధునిక మిషన్లను ఏర్పాటు చేసినప్పటికీ టెక్నీషియన్లు లేకపోవడంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు సేవలు అందడం లేదు. మధ్యాహ్నం వరకే స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు తీస్తూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.

పూర్తి స్థాయిలో సేవలు అందేలా చూస్తాం..

ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ సేవలు అందేలా చర్యలు తీసుకుంటాం. టెక్నీషియన్ల కొరత ఉంది. ఇద్దరు టెక్నీషియన్లు మాత్రమే ఉన్నారు. పూర్తి స్థాయిలో పని చేయలేకపోతున్నారు. మరికొంత మంది టెక్నీషియన్లు రిక్రూట్‌మెంట్‌ ద్వారా రానున్నారు. త్వరలో అన్ని రకాల సేవలను అందిస్తాం.

– శ్రీనివాసరావు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

జీజీహెచ్‌లోని రేడియాలజి హబ్‌

న్యూస్‌రీల్‌

ప్రైవేట్‌ దారి..

ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు సరైన సేవలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా స్కానింగ్‌, ఎక్స్‌రే కోసం వచ్చే వారికి మా త్రం ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ రోజు సమయం అయిపోయింది.. రేపు రావాలని సిబ్బంది సూచిస్తుండడంతో రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రుల దారి పడుతున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సేవలు అందించడంలో సిబ్బంది విఫలమవుతున్నారని ప్రజాప్రతినిధులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినా వారిలో మార్పురావడం లేదు. సాయంత్రం వేళల్లో ప్రమాదాలు జరిగి ఆస్పత్రికి వెళ్తే టెక్నీషియన్లు అందుబాటులో ఉండడంలేదు. దీంతో క్షతగాత్రులను ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లకు తీసుకెళ్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో అరకొరగా ఎక్స్‌రే, స్కానింగ్‌ సేవలు

సేవలు అందించడంలో

టెక్నీషియన్ల విముఖత

లక్షలు పెట్టి పరికరాలు

కొనుగోలు చేసినా అందని సేవలు

ప్రజాప్రతినిధులు హెచ్చరించినా

మారనితీరు..

No comments yet. Be the first to comment!
Add a comment
గురువారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 20251
1/2

గురువారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 2025

గురువారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 20252
2/2

గురువారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement