ఆర్యూబీ మూసివేత
వచ్చే నెల 25వరకు..
రైల్వే మూడో లైన్ నిర్మాణంలో భాగంగా ఆబ్రిడ్జిపైన పనులు చేపడుతున్నారు. దీంతో నెలరో జుల పాటు ఆర్యూబీ బంద్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఈనెల 24న ప్రకటనలో తెలుపడంతో పాటు బిడ్జ్రి వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా ఈనెల 25 నుంచి వచ్చే నెల 25వరకు ఆర్యూబీ బంద్ చేస్తామని తెలిపినప్పటికీ.. ఈనెల 29న సాయంత్రం 6 గంటల తర్వాత రాకపోకలు నిలిపివేశారు. పూర్తిగా గోడమాదిరిగా రేకులు ఏర్పాటు చేశారు.
మహబూబాబాద్: రైల్వే మూడో లైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఆర్యూబీ(రైల్వే అండర్ బ్రిడ్జి)ని బుధవారం రాత్రి తాత్కాలికంగా మూసివేశారు. నెలరోజులపాటు క్లోజ్ ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా ఆయూబీ మూసి ఉండడంతో వాహనదారులు, ప్రజలు, రోగులకు ఇబ్బందులు తప్పవు. ఆర్‌యూబీపై పనులు పూర్తి అయ్యేంత వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పనుల నిమిత్తం..
ప్రతీరోజు పలు పనులు నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చే వారు వేల సంఖ్యలో ఉన్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు నిత్యం రద్దీగా ఉంటాయి. కొత్త బజార్ నుంచి పాత బజార్‌కు ఆర్యూబీ గుండా వాహనదారులు వెళ్తుంటారు. ఏ క్యాబిన్ వద్ద గేట్ ఉన్నప్పటికీ మానుకోటలో రైళ్ల హాల్టింగ్‌లు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ సమ యం గేట్ వేసే ఉంటుంది. ఉదయం, సాయంత్రం ఆగేట్ వద్దగంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది.
ఆర్వోబీనే దిక్కు..
ఆర్యూబీలో రాకపోకలు బంద్‌కావడంతో జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)నే దిక్కుగా మారింది. ఆబిడ్జ్రి ప్రస్తుతం రాత్రి సమయంలో మందుబాబులకు అడ్డాగా మారింది. కాగా కురవి రోడ్డులో రద్దీ పెరగగడంతో పాటు ఆర్వోబీ గుండా రాకపోకలు పెరిగాయి.
ఇబ్బందులు పడుతున్న రోగులు..
ఆర్యూబీ దగ్గరలోనే జిల్లా ప్రధాన వైద్యశాల ఉంది.రాకపోకలు బంద్ కావడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్‌లు ఇక మీదట ఆ ర్వోబీ మీదుగా రావాల్సి ఉంటుంది. దీంతో దూరం చాలా వరకు పెరుగుతుంది. వైద్య పరీక్షల కోసం నడుచుకుంటూ వచ్చే వారికి కూడా చాలా ఇబ్బందిగానే ఉంది.కాగా ఆర్‌యూబీకి ప్రత్యామ్నాయ ఏ ర్పాట్లు చేయాలని మానుకోట పట్టణ ప్రజలు కోరుతున్నారు.
కొనసాగుతున్న రైల్వే మూడో లైన్ నిర్మాణ పనులు
మానుకోటలో తాత్కాలికంగా
ఆర్యూబీ క్లోజ్
వచ్చే నెల 25వరకు బంద్ చేస్తున్నట్లు
అధికారుల వెల్లడి
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని
వాహనదారుల విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment