రేగొండ: భార్య మీద అనుమానంతో దాడి చేయడానికి వెళ్లి, అత్తను హత్య చేసిన అల్లె ప్రభాకర్‌కు జీవిత ఖైదును విధిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు న్యాయమూర్తి నారాయణ బాబు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యుషన్ కథనం ప్రకా రం.. కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్ గ్రామానికి చెందిన అల్లె ప్రభాకర్‌కు అదే గ్రామానికి చెందిన సుజాతతో వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇతరులతో అక్రమ సంబంధం ఉందని భార్య సుజాతను వేధించేవాడు. ఈ క్రమంలో సుజాత ఘటనకు 20 రోజుల ముందు తల్లిగారింటికి వెళ్లింది. ఆమెను చంపాలనే ఉద్ధేశంతో 2019 మే 14న రాత్రి 11 గంటల సమయంలో ఆరుబయ ట పడుకున్న తన అత్త ఒన్నాల లక్ష్మిని గొడ్డలితో నరకగా ఆమె చనిపోయింది. అరుపులు విని సుజా త ఇంట్లో నుంచి బయటికి రావడంతో ఆమైపె గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమె దవడకు గాయమైంది. చుట్టుపక్కల వారు రావడంతో నిందితుడు పారిపోయాడు. లక్ష్మి కుమారుడు మల్లయ్య ఫిర్యా దు మేరకు అప్పటి రేగొండ ఎస్సై సధాకర్ కేసు నమోదు చేయగా, సీఐ శ్రీనివాస్ నిందితున్ని అరె స్టు చేశాడు. తర్వాత సీఐ సాయిరమణ చార్ఙిషీటును దాఖలు చేశారు. విచారణలో నేరనిర్ధారణ కావడంతో ప్రభాకర్‌కు జీవితఖైదు, రూ.10 వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున శ్రీనివాస్, కోర్టు పర్యవేక్షాణాధికారులు వెంకన్న, జ్యోతి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సమర్ధవంతంగా విధులు నిర్వరించిన దర్యాప్తు అధికారి చిట్యాల సీఐ మల్లేష్, రేగొండ ఎస్సై సందీప్‌కుమార్‌ను భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment