వేసవికి సన్నద్ధం కావాలి
హన్మకొండ: వేసవిలో విద్యుత్ సంబంధ సమస్యలు నివారించేందుకు అధికారులు ప్రణాళిక ప్రకా రం పనులు పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 16 సర్కిళ్ల పరిధిలో వి ద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ మా ట్లాడుతూ వేసవి కాలానికి అధికారులు పూర్తిగా సమాయత్తం కావాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 16 సర్కిళ్లకు నోడల్ ఆఫీసర్లను నియమించామన్నారు. నేడు (బుధవారం) సర్కిళ్లలో జరిగే సమావేశంలో నోడల్ ఆఫీసర్లు పాల్గొని రూపొందించిన ప్రణాళిక మేరకు పనులు జరిగాయా లేదా అని సమీక్షించాలన్నారు. ఓవర్ లోడ్ ఉన్న చోట ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచా లని, అవసరమున్న చోట కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏ ర్పాటు చేయాలన్నారు. అత్యవసర సర్వీస్‌లో భాగమైన జిల్లా ఆస్పత్రులు, ఇతర సర్వీసులకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించేందుకు ఇంటర్ లింకింగ్ లైన్ల వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, టి.మధుసూదన్, వి.తిరుపతి రెడ్డి, సీఈలు రాజుచౌహన్, బీకం సింగ్, అశోక్, కె.ఎన్. గుట్ట, తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలి
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment