జేఈఈ మెయిన్స్‌కు 44 మంది గైర్హాజరు
విద్యారణ్యపురి: దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీ, నిట్‌లలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్స్ పరీక్షలు హనుమకొండ, వరంగల్‌లో కలిపి 5 సెంటర్లలో కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించిన మొదటి సెషన్లో 1,243మంది అభ్యర్థులకు 1,208మంది హాజరుకాగా 35మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్‌ను మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6గంటల వరకు నిర్వహించగా అందులో1,133 మంది అభ్యర్థులకు 1,124 మంది హాజరుకాగా 9 మంది గైర్హాజరయ్యారు. రెండు సెషన్లు కలిపి 44మంది గైర్హాజరయ్యారని సిటీ కోఆర్డినేటర్ కె. శ్రీలతారెడ్డి తెలిపారు.
ఇద్దరు సీనియర్
అసిస్టెంట్లకు పదోన్నతి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. పదోన్నతి పొందిన వారిలో యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల సీనియర్ అసిస్టెంట్ బీసీఎం రాజు, యూనివర్సిటీ న్యాయ కళాశాల సీనియర్ అసిస్టెంట్ ఆర్. స్వరూపరాణి ఉన్నారు. వీరికి వీసీ ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులు అందజేశారు.
కొనసాగుతున్న శిక్షణ..
కాకతీయ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎన్సీసీ జవాన్ల శిక్షణ కార్యక్రమంలో కొనసాగుతోంది. మంగళవారం ఈ శిక్షణలో కేయూ రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి పాల్గొని ‘ఆటోమేషన్ టాక్స్ విత్ మ్యాక్రోస్’ అనే అంశంపై విస్త్రతోపన్యాసం చేశారు. కార్యక్రమంలో ఆ విభాగం అధిపతి రమ పాల్గొన్నారు.
ఆన్లైన్ మోసం..
● ఉద్యోగం కోసం రూ.2.50 లక్షలు పోగొట్టుకున్న యువకుడు
నెల్లికుదురు: ఓ యువకుడు ఆన్లైన్లో ఉద్యోగ ప్రకటన చూసి రూ.2.50 లక్షలు చెల్లించి మోసపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుది. బాధితుడు కాటమల్ల రాజు కథనం ప్రకారం.. సంవత్సరం క్రితం ఆన్లైన్ యాప్‌లో ప్రకటన చూసిన రాజు.. ఉద్యోగం కోసం సంస్థకు రూ.2.50 లక్షలు చెల్లించాడు. అనంతరం ఉద్యోగం కోసం సంస్థకు కొన్ని రోజులుగా ఫోన్ చేస్తున్నాడు. అయితే నిర్వాహకులు స్పందించడం లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన రాజు.. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment