విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి
విద్యారణ్యపురి : తాను వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉండబోతున్నానని, తనను గెలిపిస్తే ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు, విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ అన్నారు. మంగళవారం హనుమకొండలోని ఎస్‌టీయూ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరునెలలుగా ఈ–కుబేర్‌లోపెండింగ్‌లో ఉన్న బిల్లులు, డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త పీఆర్‌సీ అమలు చేయాలన్నారు. హెల్త్‌కార్డుల ద్వారా సంపూర్ణ వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. ఇంకా మిగిలిన 317 జీఓ బాధితులకు న్యాయం చేయాలన్నారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. పర్వతరెడ్డి, జనరల్ సెక్రటరీ సదానందగౌడ్, టీపీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. చెన్నయ్య,ప్రధాన కార్యదర్శి చంద్రయ్య, బీసీటీఏ అధ్యక్షుడు కృష్ణుడు, బీసీటీయూ అధ్యక్షుడు శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు పెంట అంజయ్య, ప్రధాన కార్యదర్శి దానయ్య, టీజీహెచ్‌ఎం అసోసియేషన్ అధ్యక్షుడు జి. హేమచంద్ర, ఎస్‌టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి డాక్టర్ ఆట సదయ్య మాట్లాడారు. సమావేశంలో ఎస్‌టీయూ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కామగోని రాంబాబు, మధులిమాయే, వేమునూరు రాంబాబు, నాగరాజు పాల్గొన్నారు.
టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్
Comments
Please login to add a commentAdd a comment