అనుమానం పెనుభూతమైంది..
కేసముద్రం: అనుమానం పెనుభూతమైంది. భార్యతో కడ వర కూ జీవించాల్సిన ఓ భర్త...ఆమె పై అనుమానం పెంచుకున్నాడు. కర్రతో తలపై కొట్టి, ఆపై కత్తితో పొట్టలో పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరిలో చోటుచేసుకుంది. రూరల్ సీఐ సర్వయ్య కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వాంకుడోత్ రఘు.. గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్‌కు చెందిన కున్‌సోతు హట్యా, తారి దంపతుల కూతురు సుగుణ(25)ను వివాహం చేసుకున్నాడు. రఘు జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా సుగుణపై రఘు అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడుతున్నాడు. ఈనెల 25న కూడా గొడవపడి క్షణికావేశంలో భార్య తలపై కర్రతో కొట్టి, ఆపై కత్తితో పొట్టలో పొడిచాడు. గమనించిన కుటుంబీకులు సుగుణను వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి హట్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ తెలిపారు.
భార్యను కత్తితో పొడిచిన భర్త
చికిత్స పొందుతూ మృతి
Comments
Please login to add a commentAdd a comment