మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

Published Tue, Jan 28 2025 1:17 AM | Last Updated on Tue, Jan 28 2025 1:17 AM

మనస్తాపంతో  యువకుడి ఆత్మహత్య

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

తొడేళ్లగూడెంలో ఘటన

తన మృతికి ముగ్గురు కారణమంటూ

సెల్ఫీ వీడియో

డోర్నకల్‌: ఓవ్యక్తితో గొడవలతోపాటు పోలీసు కేసు నమోదు కావడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన డోర్నకల్‌ మండలం తొడేళ్లగూడెంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పగడాల సతీశ్‌(30) ట్రాక్టర్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామస్తుడు సుంకరి వెంకన్న, సతీశ్‌ మధ్య గొడవల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకన్న కౌలుకు తీసుకున్న భూమి నుంచి ఈ నెల 21 సతీశ్‌ వెన్నారం వాగు నుంచి ఇసుక తరలించాడు. దీంతో వెంకన్న ఇసుక ట్రాక్టర్‌ను అడ్డుకున్నాడు. మరుసటి రోజు సతీశ్‌ తన ఇంటి సమీపంలో వెంకన్న ఇంటికి వెళ్లే రోడ్డుపై కంప అడ్డుగా పెట్టాడు. దీనిపై వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు సతీశ్‌పై ఈ నెల 24న కేసు నమోదు చేశారు. దీంతో వెంకన్నతో గొడవలు, పోలీస్‌ కేసు నమోదు కావడంతో మనస్తాపం చెందిన సతీశ్‌ ఆదివారం ముల్కలపల్లిలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అటువైపు వెళ్తున్న వారు చూసి కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా సతీశ్‌ను ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందాడు.

నా చావుకు ఆ ముగ్గురే కారణం..

తన చావుకు సుంకరి వెంకన్న, ఆయన కుమారులు చరణ్‌, పవన్‌ కారణమని పురుగుల మందు తాగడానికి ముందు సతీశ్‌ సెల్ఫీ వీడియో ద్వా రా తెలిపాడు. ఇసుక రవాణాతో పాటు ఇతర కా రణాలతో తనను ఇబ్బందులకు గురి చేశారన్నా రు. తన చావుకు కారకులైన వారిపై చర్య తీసుకోవాలని కోరాడు. ఈ ఘటనపై మృతుడి త ండ్రి జగన్నాథం ఫిర్యాదు మేరకు సీఐ రాజేశ్‌ సోమవారం విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement