లారీని ఢీకొట్టి ఆటో బోల్తా
ఖిలా వరంగల్ : వరంగల్–ఖమ్మం హైవే మామూనురు టీజీఎస్పీ పెట్రోల్‌బంక్ స్పీడ్ బ్రేకర్ వద్ద లారీ ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం అర్ధరాత్రి అదే ప్రదేశంలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపునకు వెళ్తున్న ఆటో ఆకస్మాత్తుగా అదుపు తప్పి లారీని ఢీకొట్టి ఎదురుగా వచ్చే కారును ఢీకొని రోడ్డుపై అడ్డంగా బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా ఓ ప్రయాణికుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన నాగరాజు ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపునకు ప్రయాణికుడిని ఆటోలో ఎక్కించుకొని బయలుదేరాడు. ఈ క్రమంలో నలుగురు మృతిచెందిన ఘటనాస్థలికి రాగానే ఒక్కసారిగా ఆటో అదుపుతప్పి లారీ, కారును ఢీకొడుతూ బోల్తా పడింది. గాయపడిన డ్రైవర్‌తో పాట ప్రయాణికుడిని స్థానికులు 108లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రోడ్డుపై అడ్డుగా బోల్తా పడిన ఆటోను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
డ్రైవర్‌కు గాయాలు
ఘటన ప్రదేశంలోనే మరో ఘటన
Comments
Please login to add a commentAdd a comment