
మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే, భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి మొత్తం ఆస్తుల విలువ రూ.116.66 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. అలాగే రూ. 12.58 కోట్లు అప్పులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆయన భార్య జమున పేరిట మొత్తం రూ. 83.67 కోట్ల ఆస్తులు ఉండగా, రూ. 13.93 కోట్లు అప్పులు ఉన్నట్టుగా బుధవారం నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించారు.
కాగా 2018 ఎన్నికల అఫిడవిట్‌లో మొత్తం ఆస్తుల విలువ రూ.118.02 కోట్లుగా ప్రస్తావించగా ప్రస్తుత అఫిడవిట్‌లో ఆస్తుల విలువ సుమారు రూ.2కోట్లు తగ్గింది. అలాగే అప్పులు రూ.36.91 కోట్ల నుంచి రూ.12.58 కోట్లకు తగ్గాయి. ప్రస్తుత ఎన్నికల అఫిడవిట్ ప్రకారం భార్యాభర్తల మొత్తం ఆస్తుల విలువ రూ.200.33 కోట్లు కాగా, మొత్తం అప్పులు రూ. 26.51 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది.
2018 ఎన్నికల అఫిడవిట్‌లో ఎమ్మెల్యే మర్రిపై ఎలాంటి కేసులు లేవని పేర్కొనగా, ప్రస్తుత అఫిడవిట్‌లో తనపై తెలకపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నంబరు 113/2023 కేసులో ఐపీసీ 506 సెక్షన్ కింద కేసు నమోదైనట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment