ఆ సార్ రూటే సప‘రేటు’..
తాజాగా ఏసీబీకి పట్టుబడిన డీఈఓ రవీందర్ ఏ జిల్లాలో పనిచేసినా.. ఆయన రూటే సప‘రేటు’ అనే విధంగా వ్యవహార శైలి మార్చుకున్నాడు. జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో పనిచేసిన సమయంలో డీఈఓ రవీందర్ అవినీతి వ్యవహారాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. మూడేళ్ల క్రితం మహబూబ్‌నగర్ డీఈఓగా వచ్చారు. జిల్లాస్థాయి అధికారిగా పనిచేస్తూ రూ.లక్షలు గడించినట్లు ఆరోపణలున్నాయి. కాగా.. డీఈఓ రవీందర్ లంచం రూపంలో ఉపాధ్యాయుల నుంచి తీసుకున్న డబ్బులకు సంబంధించి కొందరు ఫోన్ పే, గూగుల్ పేకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను ఏసీబీ అధికారులకు అప్పగించినట్లు సమాచారం. ఎవరి వద్ద ఎంత స్థాయిలో డబ్బు వసూలు చేశాడనే విషయంపై ఏసీబీ బృందం కూపీ లాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment