జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఓటర్‌గా నమోదుకు ఈ నెల 9, 10 తేదీల్లో బూత్‌స్థాయి ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయేందిర తెలిపారు. జనవరి 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి అర్హులైన వారు ఓటర్‌గా నమోదు చేసుకోవడానికి మరో అవకాశం అని, ఓటరు జాబితాలో పేరు లేకుంటే ఫారం–6 ద్వారా పోలింగ్‌కేంద్రంలో ఉన్న బీఎల్‌ఓ దగ్గర నమోదు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ బూతుల్లో నవంబర్ 9, 10 తేదీల్లో బూత్‌స్థాయి అధికారులు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ బూత్‌లలో ఫారం– 6, 7, 8, 8ఏ దరఖాస్తులు బీఎల్‌ఓల దగ్గర అందుబాటులో ఉంటాయని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు రెండు కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, నివాస, వయసు ధ్రువీకరణ పత్రం తీసుకొని రావాలని సూచించారు. ఆన్‌లైన్‌లో www.nvsp.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఓటరు నమోదు సమాచారం కోసం 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment