
సంగమేశ్వరా.. దారి చూపవా..
వివరాలు IIలో u
● కృష్ణాతీరంలోనిసంగమేశ్వరుని దర్శనానికి సరిహద్దు పంచాయితీ
● ఏపీ పరిధిలోని ఆలయం చెంతకు తెలంగాణ బోట్లను రానివ్వకుండా అడ్డుపడుతున్నఏపీ జాలర్లు
● స్వామి దర్శనానికి వ్యయ ప్రయాసలతో కష్టాలు పడుతున్న భక్తులు
● ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమేసంగమేశ్వరుడి దర్శనం
కృష్ణాతీరంలోని సంగమేశ్వరుడి ఆలయం
సాక్షి, నాగర్‌కర్నూల్: ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే ఆలయం తెరచుకుని ఉంటుంది. మిగతా కాలమంతా నీటిలోనే మునిగి ఉంటుంది. ఏడు నదులు ఒక చోట కలిసే సంగమేశ్వర క్షేత్రంలో స్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తులకు ప్రయాసలు తప్పడం లేదు. కృష్ణాతీరానికి ఇరువైపులా ఉన్న స్థానిక గ్రామాల జాలర్లు, బోట్ల నిర్వాహకుల మధ్య వివాదం, ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు పంచాయితీని తీసుకువచ్చింది. ఫలితంగా సంగమేశ్వరుడి దర్శనం కోసం వస్తున్న భక్తులు, పర్యాటకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.