మందమర్రిరూరల్: రుణాల రికవరీలో ఆదర్శంగా నిలిచిన మందమర్రి సీ్త్రనిధికి రాష్ట్రస్థాయి ఉత్త మ అవార్డు దక్కింది. మందమర్రి మున్సిపాలిటీలో సీ్త్రనిధి ఆధ్వర్యంలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.5 కోట్ల రుణాలు మంజూరు చేయడమే కాకుండా 98 శాతం రికవరీ చేసి రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచింది. బుధవారం ఆల్ ఇండియా ఇ నిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరి యమ్ (గచ్చిబౌలి)లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సీ్త్రనిధి మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్ చేతుల మీదుగా మందమర్రి మెప్మా టీఎంసీ రఘురాం, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు మౌనిక, అసిస్టెంట్ మేనేజర్ మమత అవార్డు అందుకున్నా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందమర్రి మున్సిపాలిటీకి అవార్డు రావడానికి సహకరించిన మున్సిపల్ కమిషనర్ రాజలింగు, మహిళా సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.