● సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణరావు, సూర్యనారాయణ ● ఎస్టీపీపీలో బీహెచ్‌ఈఎల్, సింగరేణి అధికారుల సమావేశం
జైపూర్: మండల కేంద్రంలో 1200మెగావాట్ల పవర్ ప్లాంటు విస్తరణలో భాగంగా కొత్తగా నిర్మించనున్న 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదిత స్థలం, అన్ని రకాల సదుపాయాల కల్పనకు సింగరేణి సంస్థ సంసిద్ధంగా ఉందని సంస్థ డైరెక్టర్లు సత్యనారాయణరావు, ఎల్‌వీ.సూర్యనారాయణ తెలిపారు. స్థానిక ప్లాంటులోని అడ్మిన్ భవన కార్యాలయంలో గురువారం బీహెచ్‌ఈఎల్, సింగరేణి అధికారుల సంయుక్త సమావేశం నిర్వహించారు. బీహెచ్‌ఈఎల్ ఈడీ వినోద్ జాకబ్ సామ్, సింగరేణి డైరెక్టర్లు పాల్గొన్నారు. ఫిబ్రవరిలో 800 మెగావాట్ల సామర్థ్యం గల మూడో యూనిట్ నిర్మాణానికి సింగరేణి, బీహెచ్‌ఈఎల్ మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి సమావేశంలో ముందస్తు ప్రణాళికలు, సాంకేతిక అంశాలపై సమీక్ష, నిర్మాణ ప్రణాళిక, నాణ్యత, ఆడిట్, బిల్లింగ్ విధివిధానాలపై చర్చించారు. అనంతరం డైరెక్టర్లు మాట్లాడుతూ నిర్ణీత సమయంలో నిర్మాణం పూర్తి చేయాలని, ఏప్రిల్ మొదటి వారంలో పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కే.వెంకటేశ్వర్లు, ఎస్టీపీపీ ఈడీ శ్రీనివాసులు, జీఎం కో ఆర్డినేషన్ సుభానీ, జీఎంలు సుబ్బారావు, సూర్యనారాయణ, ఏజీఎంలు విశ్వనాథరాజు, మురళీధర్, మదన్‌మోహన్, డీజీఎంలు అజ్జుల ఖాన్, ఆజ్మీర తుకరాం, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఎంవీ.వేణుగోపాల్‌రావు, బీహెచ్‌ఈఎల్ అధికారులు ఆశా, శివ చరణ్‌వర్మ, మధు కిరణ్ పాల్గొన్నారు.