మహిమానిత్వం వీరభద్రాలయం | Sakshi
Sakshi News home page

మహిమానిత్వం వీరభద్రాలయం

Published Fri, May 24 2024 1:35 PM

మహిమా

టేక్మాల్‌(మెదక్‌): నవాహ్నిక బ్రహ్మోత్సవాలకు భద్రకాళీ సమేత వీరభద్రాలయం ముస్తాబైంది. ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మండలంలోని బొడ్మట్‌పల్లి గ్రామంలోని గుట్టపై భద్రకాళీ సమేత వీరభద్రుడు వెలిశాడు.

ఉత్సవాల వివరాలు...

నేటి నుంచి 31 వరకు నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగనున్నాయి. 24న గణపతి పూజ, భద్రకాళీ సమేత వీరభద్రడుకి అభిషేకం, రాత్రి 7గంటలకు అగ్ని గుండాలు. 25న భద్రకాళీ సమేత వీరభద్రుడికి అభిషేకాలు, ఎదుర్కొళ్లు, స్వామివారి కల్యాణోత్సవం, సాయంత్రం షావ ఊరేగింపు. 26న ఉదయం గణపతిపూజ, అభిషేకం, గ్రామ దేవతలు దుర్గమ్మ, పోచమ్మలకు బోనాల ఊరేగింపు. 27న ఉదయం గణపతిపూజ, అభిషేకం, గ్రామ దేవతలకు బండ్ల ఊరేగింపు ఊరేగింపు. 28న ప్రత్యేక పూజలతో పాటూ కుస్తీ పోటీలు. 29న రథోత్సవం, 30న ప్రత్యేక పూజలతో పాటూ లంకాదహనం, 31న పాచిబండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు.

నేటి నుంచి 31 వరకు బ్రహ్మోత్సవాలు

ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ

సమష్టి కృషితో..

ఉత్సవాలు ప్రారంభం అయిన నాటి నుంచి ఉపవాసదీక్షతో పూజలు నిర్వహిస్తాం. ఉత్సవాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. గ్రామస్తులు సమష్ట కృషితో ఆలయ అభివృద్ధికి పనిచేస్తున్నారు.

– బస్వరాజ్‌, ఆలయ కమిటీ చైర్మన్‌, బొడ్మట్‌పల్లి

ఇబ్బందులు రానివ్వం

జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నీటి వసతి, పారిశుధ్ధ్యం పనులు పూర్తి చేశాం. వసతుల కల్పనకు గ్రామస్తులు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు.

– కృష్ణ, తహసీల్దార్‌, టేక్మాల్‌

మహిమానిత్వం వీరభద్రాలయం
1/3

మహిమానిత్వం వీరభద్రాలయం

మహిమానిత్వం వీరభద్రాలయం
2/3

మహిమానిత్వం వీరభద్రాలయం

మహిమానిత్వం వీరభద్రాలయం
3/3

మహిమానిత్వం వీరభద్రాలయం

Advertisement
 
Advertisement
 
Advertisement