పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు
పెద్దశంకరంపేట(మెదక్): పార్టీలకతీతంగా ప్రభు త్వ పథకాలను ప్రజలకు అందజేస్తున్నామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. బుఽ దవారం పెద్దశంకరంపేటలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నాయకులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గతంలో అధికార పార్టీ వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాయని, ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నివర్గాలకు అందజేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో దళారులుగా ఉండి కమీషన్లు తీసుకొని కల్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చారన్నారు. భావితరాలు ఇబ్బందులు పడొద్దని ప్రభుత్వ భూములు అమ్మడం లేదని వివరించారు. ఎంపీడీఓ రఫీఖ్‌ఉన్నీసా, తహసీల్దార్ గ్రేస్‌బాయి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మధు, నాయకులు నారాగౌడ్, సంగమేశ్వర్, పెరుమాండ్లు, సత్యనారాయణ, శ్రీను, చందర్, సంగయ్య, రాజునాయక్, అంజిరెడ్డి, అనంతరావు, గోవింద్‌రావు, సాయిలు పాల్గొన్నారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment