దీనంతటికీ కారణం మీరే.. హీరోయిన్ నయనతార ఇంట్రెస్టింగ్ పోస్ట్ | Actress Nayanthara Instagram Post About Her 20 Years Film Career | Sakshi
Sakshi News home page

Nayanthara: సినిమా కెరీర్ గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టిన నయన్

Published Sat, Dec 30 2023 1:44 PM | Last Updated on Sat, Dec 30 2023 1:51 PM

Actress Nayanthara Instagram Post About Her 20 Years Career - Sakshi

హీరోయిన్ నయనతార. ఈ పేరు చెప్పగానే సౌత్ లేడీ సూపర్‌స్టార్. మంచి నటి. సినిమాల్లో తప్ప ప్రమోషన్స్‌లో పెద్దగా కనిపించదు. ఇలా మీకు చాలా గుర్తొస్తాయి. కొన్నేళ్ల ముందు పెళ్లి చేసుకున్న నయన్.. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయిపోయింది. అలాంటి ఈమె ఇప్పుడు ఇన్ స్టాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. అదికాస్త ఇప్పుడు వైరల్ అయిపోతోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

నటిగా నయనతార 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ.. తొలుత మాతృభాష మలయాళంలో 'మనసినక్కరే' చిత్రంలో నటించింది. ఆ తర్వాత తమిళంలో 'అయ్యా' మూవీ చేసింది. గజనీ, చంద్రముఖి లాంటి మూవీస్ నయన్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. తెలుగులోనూ ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఈ భామ.. ఈ ఏడాది 'జవాన్'తో పాన్ ఇండియా స్థాయి క్రేజ్ సొంతం చేసుకుంది. 

20 ఏళ్లపాటు నటిగా కొనసాగి 75 సినిమాలు కంప్లీట్ చేసిన నయన్.. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుని, ఇక్కడ నిలబడడానికి అభిమానులైన మీరే కారణం. నాకు బలమైన శక్తిగా, గుండె చప్పుడుగా మీరు నిలిచారు. మీరు లేకపోతే నా సినిమా జీవితం పరిపూర్ణం అయ్యేది కాదు. ఈ మైలురాయిని దాటడానికి ప్రోత్సహించింది మీరే. నా పక్కన బలంగా నిలిచి, ప్రోత్సహించడాన్ని ఇప్పుడు వేడుకగా జరుపుకొంటున్నా అని నయనతార రాసుకొచ్చింది.

(ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement