అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి! | Aishwarya Rai Hints Divorce Rumours Separate Appearance For Anant Ambani Wedding | Sakshi
Sakshi News home page

Aishwarya Rai: కొన్నాళ్లుగా రూమర్స్.. పెళ్లికి వచ్చి క్లారిటీ ఇచ్చేసిందా?

Published Sat, Jul 13 2024 4:39 PM | Last Updated on Sat, Jul 13 2024 4:48 PM

Aishwarya Rai Hints Divorce Rumours Separate Appearance For Anant Ambani Wedding

శుభమా అని అంబానీ కొడుకు పెళ్లి జరుగుతుంటే విడాకుల గురించి మాట్లాడుతున్నాం ఏంటా అని మీరు అనుకోవచ్చు. కానీ సోషల్ మీడియాలో చర్చంతా దీని గురించే నడుస్తోంది. గత కొన్నాళ్లుగా విశ్వ సుందరి ఐశ్వర్యా రాయ్ విడాకుల గురించి అప్పుడప్పుడు పుకార్లు వినిపించాయి. కానీ అలాంటిదేం ఉండకపోవచ్చని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అంబానీ పెళ్లి వల్ల ఇదే నిజమేనా అనే సందేహం వస్తోంది.

(ఇదీ చదవండి: అనంత్- రాధిక వెడ్డింగ్‌.. ఒక్క పాటకు రూ.25 కోట్లా!)

ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కనివినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, క్రీడ ప్రముఖులు పెళ్లిలో సందడి చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి కూడా మహేశ్ బాబు, రామ్ చరణ్, వెంకటేశ్ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇదే వేడుకకు ఐశ్వర్యా రాయ్ మాత్రం భర్తతో కాకుండా విడిగా వచ్చింది.

అంబానీల పెళ్లిక కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య రాయ్ రాగా.. ఈమె భర్త అభిషేక్ బచ్చన్ మాత్రం తన కుటుంబంతో కలిసి విచ్చేశాడు. ఇది చూస్తే ఐశ్వర్యా రాయ్ విడాకుల వార్త నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం భార్యభర్తలు విడివిడిగా ఉంటున్నారు కాబట్టి ఇలా విడిగా వచ్చారా అని సందేహాలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తే గానీ నెటిజన్లు ఊరుకోరేమో?

(ఇదీ చదవండి: 'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement