
అక్కినేని ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూతురు, నాగార్జున సోదరి నాగ సరోజ అనారోగ్యంతో కన్నుమూసింది. ఈ విషాద వార్త కాస్త ఆల్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె మంగళవారం నాడు మరణించినట్లు తెలుస్తోంది. నాగేశ్వరరావుకు సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, వెంకట్, నాగార్జున.. ఇలా ఐదుగురు సంతానం అన్న సంగతి తెలిసిందే!
అందులో సత్యవతి చాలా ఏళ్ల క్రితమే మరణించగా నాగ సరోజ అనారోగ్యంతో నిన్న స్వర్గస్తులయ్యారు. ఈమె మొదటి నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంది. సినిమా రిలీజ్ ఫంక్షన్‌లో కానీ, బయట ఏ ఇతర ఫంక్షన్‌లోనూ పెద్దగా కనిపించలేదు. స్టార్ హీరో కూతురు అయినప్పటికీ చాలా సింపుల్‌గా జీవితాన్ని గడిపేసింది. చివరి వరకు అలాగే ఉండిపోయింది. అందుకే తన మరణవార్త సైతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చదవండి: ఆ హీరో నన్ను మోసం చేశాడు, జన్మలో అతడితో కలిసి పని చేయను
Comments
Please login to add a commentAdd a comment