
ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్ సమర్పణలో బాబా పి.ఆర్. దర్శకత్వంలో మనోజ్‌కుమార్ అగర్వాల్ నిర్మించిన చిత్రం 'అష్టదిగ్బంధనం'. సూర్య, విషిక జంటగా నటించిన ఈ మూవీ ట్రైలర్‌ని ఇటీవలే రిలీజ్ చేశారు. ఈనెల 22న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు.
(ఇదీ చదవండి: రతిక వెన్నుపోటు.. గిలగిలా కొట్టేసుకున్న ప్రిన్స్ యవర్)
అష్టదిగ్బంధనం.. చాలా పవర్‌ఫుల్ టైటిల్. ఈ సినిమాలో దాన్ని జస్టిఫై చేసేలా ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకున్నాం. టైటిల్‌కు తగ్గట్టుగానే ఇందులోని ప్రతి క్యారెక్టర్ అవతలి వారిని అష్టదిగ్బంధనం చేయాలని చూస్తుంటుంది. ఇలా పలువురు వ్యక్తుల స్వార్ధంతో కూడిన జీవితాలకు సంబంధించినదే ఈ కథ అని దర్శకుడు బాబా పిఆర్ చెప్పుకొచ్చారు. యాక్షన్, థ్రిలర్స్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ మూవీ కనెక్ట్ అవుతుందన్నారు.
ఇవాళ చిన్న సినిమాలు విడుదల కావడమే కష్టమైపోయింది. మీరు ఏ ధైర్యంతో ఇంత బడ్జెట్ పెట్టారనే ప్రశ్నకు బదులిచ్చిన నిర్మాత మనోజ్ కుమార్.. కేవలం కథ మీద నమ్మకమే తనని ముందుకు నడిపిందని అన్నారు. సినిమాను సినిమాగా తీస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని చెబుతూ, దర్శకుడు సినిమా బాగా తీశారని అన్నారు.
(ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!)
Comments
Please login to add a commentAdd a comment