పిల్లల్ని కనాలని ఉంది: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ | Bigg Boss 14 Finalist Rakhi Sawant Comments On Her Motherhood | Sakshi
Sakshi News home page

మాతృత్వాన్ని అనుభవించాలని ఉంది: రాఖీ సావంత్‌

Feb 25 2021 11:32 AM | Updated on Feb 25 2021 1:57 PM

Bigg Boss 14 Finalist Rakhi Sawant Comments On Her Motherhood - Sakshi

ఎందుకంటే నా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఇప్పుడు జీరో ఉంది. నాకిప్పుడు డబ్బులు చాలా అవసరం.

బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌కు ఈ మధ్యే శుభం కార్డు పడింది. సింగర్‌ రాహుల్‌ వైద్యను వెనక్కు నెట్టి సీరియల్‌ నటి రుబీనా దిలైక్‌ విజేతగా అవతరించింది. కానీ రూ.50 లక్షల ప్రైజ్‌మనీలో 35 లక్షలు మాత్రమే గెలుచుకుంది, కారణం రాఖీ సావంత్‌. ఎప్పటిలాగే గ్రాండ్‌ ఫినాలేలో డబ్బులు తీసుకుని స్వతాహాగా ఎలిమినేట్‌ అయే ఆప్షన్‌ పెట్టగా రాఖీ అందుకు మొగ్గు చూపింది. విన్నర్‌ ప్రైజ్‌మనీకి కోత పెడుతూ అందులో నుంచి రూ.14 లక్షలు తీసుకుని ఇంటిదారి పట్టింది. ఆమె తీసుకున్న తెలివైన నిర్ణయాన్ని చాలామంది మెచ్చుకున్నారు.

దీని గురించి ఆమె మాట్లాడుతూ.. "నేను కచ్చితంగా గెలుస్తాను అనుకున్నా. కానీ, రానురానూ నాకన్నా రుబీనాకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనిపించింది. ఒకవేళ గెలుపు చేజారితే రన్నరప్‌గా లేదంటే సెకండ్‌ రన్నరప్‌గా నిలుస్తానని భావించాను. కానీ దానివల్ల నాకెలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే నా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఇప్పుడు జీరో ఉంది. నాకిప్పుడు డబ్బులు చాలా అవసరం. కొన్ని నెలలుగా అమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నేను సంపాదించిందంతా చికిత్సకే అయిపోయింది. అందుకే డబ్బులు తీసుకుని ఎలిమినేట్‌ అయ్యా. బిగ్‌బాస్‌ తర్వాత నేను మొట్టమొదటగా అమ్మతోనే మాట్లాను. ఇప్పుడు ఆమె ఆరోగ్యం కుదుటపడేందుకు నా దగ్గర సరిపడేంత డబ్బులు ఉన్నాయి, అందుకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చింది.

రాఖీ సావంత్‌ వ్యాపారవేత్త రితేశ్‌ను పెళ్లాడింది. కానీ అతడికి ఇదివరకే పెళ్లైందని, ఓ బిడ్డ కూడా ఉన్నారని తెలిసి షాక్‌కు గురైంది. పైగా రాఖీతో పెళ్లి విషయాన్ని కూడా బయట ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకున్నాడు. కానీ బిగ్‌బాస్‌కు వచ్చాక ఆ విషయాన్ని నటి బహిర్గతం చేసింది. దానికి తన భర్త ఎలా స్పందిస్తాడో తెలీదని, ఒకవేళ విడాకులు కూడా కావచ్చేమోనని చెప్పింది. కానీ ప్రస్తుతం తనకు మాతృత్వాన్ని అనుభవించాలని ఉందని మనసులోని మాట బయట పెట్టింది. తన అండాలను భద్రపర్చానని తెలిపింది. కానీ తనకు విక్కీ డోనార్‌ అవసరం లేదని తన బిడ్డకు నిజమైన తండ్రి కావాలని చెప్తోంది. ఒంటరి తల్లిగా ఉండటం అస్సలు ఇష్టం లేదంటోంది. కానీ ఇదెలా సాధ్యం అవుతుందో తెలీదంటూనే త్వరలోనే దీనికి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తోంది.

చదవండి: అమ్మ కోసం ప్రార్థించండి: రాఖీ సావంత్‌

బాలీవుడ్‌ మీద నటుడి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement