భర్తతో విడాకులు.. తనకంటే ఆరేళ్ల చిన్నవాడితో లవ్‌లో పడ్డ నటి! | Rakhi Sawant Reveals About Her New Boyfriend Adil Durrani, Deets Inside | Sakshi
Sakshi News home page

Rakhi Sawant: ప్రేమలో పడ్డ బ్యూటీ, ఖరీదైన గిఫ్ట్‌తో ప్రియుడి సర్‌ప్రైజ్‌

Published Wed, May 18 2022 1:15 PM | Last Updated on Wed, May 18 2022 1:25 PM

Rakhi Sawant Reveals About Her New Boyfriend Adil Durrani, Deets Inside - Sakshi

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నానుతూ ఉంటుంది రాఖీ సావంత్‌. బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులర్‌ అయిన ఆమె వాలంటైన్స్‌ డే రోజు తన భర్త రితేశ్‌ సింగ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది. అతడికి ఆల్‌రెడీ పెళ్లై పిల్లాడు కూడా ఉన్నాడని తెలిసి తన గుండె ముక్కలయ్యిందని బాధపడింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వనందున తమ వివాహం చెల్లదంటూ అతడితో తెగదెంపులు చేసుకుంది. తాజాగా ఆమె వయసులో తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్‌ దురానీతో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

రితేశ్‌తో బ్రేకప్‌ తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత ఓసారి అదిల్‌ను కలిశాను. పరిచయమైన నెల రోజుల్లోనే అతడు నాకు ప్రపోజ్‌ చేశాడు. అతడు నాకంటే ఆరేళ్లు చిన్నవాడు కావడంతో నేను ప్రేమను అంగీకరించలేకపోయాను. కానీ అతడు.. వయసుతో సంబంధం లేకుండా మలైకా అరోరా- అర్జున్‌ కపూర్‌, ప్రియాంక చోప్రా- నిక్‌ జోనస్‌ జంటలు ప్రేమించుకోవడం లేదా? అన్యోన్యంగా ఉండటం లేదా? అని వారి గురించి చెప్పి ఒప్పించాడు.

ఇంతకీ అతడికి, నాకు పరిచయం ఎలా అయిందంటే.. నాకు శైలే అని బిజినెస్‌ పార్ట్‌నర్‌ ఉన్నాడు. అతడి దగ్గర నుంచి అదిల్‌ నా నంబర్‌ తీసుకున్నాడు, అలా ఇద్దరం మాట్లాడుకున్నాం. కర్ణాటకలోని మైసూర్‌లో ఉంటున్న అతడు నన్ను కలవడం కోసం ముంబై వచ్చాడు. మైసూర్‌లో ఉన్నప్పుడు నాకు బీఎమ్‌డబ్ల్యూ కారు గిఫ్టిచ్చాడు అని చెప్పుకొచ్చింది. అయితే వీరి ప్రేమకు అదిత్‌ కుటుంబం పచ్చజెండా ఊపలేదట. రాఖీ డ్రెస్సింగ్‌ స్టైల్‌ వారికి అస్సలు నచ్చదట. కానీ వారిని ఎలాగైనా ఇంప్రెస్‌ చేస్తానంటోంది రాఖీ సావంత్‌.

చదవండి 👇

 బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే, అసలైన పోటీ ఆ ఇద్దరి మధ్యే!

వాళ్లకు నా ఇంటికి వచ్చే అర్హత లేదు: కంగనా ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement