'బిగ్‌బాస్ 7' గౌతమ్‌ హీరోగా కొత్త సినిమా.. నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | Bigg Boss 7 Gautham Krishna New Movie Producer Satish Kumar Comments | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Gautam: 'బిగ్‌బాస్ 7' గౌతమ్‌ సినిమా.. నిర్మాత కామెంట్స్

Published Sun, Oct 22 2023 6:56 PM | Last Updated on Mon, Oct 23 2023 1:35 PM

Bigg Boss 7 Gautham Krishna New Movie Producer Satish Kumar Comments - Sakshi

సెవెన్ హిల్స్‌ నిర్మాణ సంస్థలో 'బిగ్‌బాస్‌ 7' ఫేమ్ గౌతమ్‌ కృష్ణ హీరోగా ఓ సినిమా తీస్తున్నారు. శ్వేతా అవాస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్స్. నవీన్ కుమార్‌ దర్శకుడు. సతీష్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. గతంలో 'బట్టల రామస్వామి బయోపిక్కు' చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.  ఆర్పీ పట్నాయక్‌‌తో 'కాఫీ విత్ ఏ కిల్లర్' మూవీ తీశారు. ఇది సతీష్ కుమార్ నిర్మిస్తున్న మూడో చిత్రం. 

(ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!)

గౌతమ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే మూడు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్‌ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'గతంలో నేను నిర్మించిన రెండు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. 'ఆకాశవీధుల్లో' సినిమాతో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు బిగ్‌బాస్‌ 7 షోతో మరింత పాపులర్‌ అయిన గౌతమ్‌ కృష్ణతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది' 

'గౌతమ్‌.. బిగ్‌బాస్‌ నుంచి తిరిగి రాగానే చివరి షెడ్యూల్‌ పూర్తి చేస్తాం. సాధారణ మధ్యతరగతి వ్యక్తి.. స్టూడెంట్‌ నుంచి కార్పోరేట్‌ స్థాయికి ఎలా ఎదిగాడు అనే పాయింట్‌తో తీస్తున్న సినిమా ఇది. త్వరలో ఫస్ట్‌లుక్, టీజర్‌ రిలీజ్ చేయడంతో పాటు మూవీ విడుదల తేదీని ప్రకటిస్తాం' అని నిర్మాత సతీశ్ చెప్పారు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: మాటలు మార్చి దొరికిపోయిన రైతుబిడ్డ.. ఫ్రూప్స్‌తో సహా మొత్తం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement