బిగ్‌బాస్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ? క్లారిటీ ఇచ్చేసిన బుల్లితెర నటి! | Bigg Boss 7 Telugu: Anjali Pavan Gives Clarity On Her Wildcard Entry | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అంజలి పవన్‌? వీడియోతో క్లారిటీ ఇచ్చిన నటి

Published Sun, Oct 8 2023 2:49 PM | Last Updated on Mon, Oct 9 2023 12:58 PM

Bigg Boss 7 Telugu: Anjali Pavan Gives Clarity On Her Wildcard Entry - Sakshi

బిగ్‌బాస్‌ షోలో కంటెస్టెంట్లు వారి ఆటమీద కన్నా పక్కవారి ఆట మీదే ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నారు. వాళ్లు చీటింగ్‌ చేస్తున్నారు, వాళ్లను సపోర్ట్‌ చేస్తున్నారు, వాళ్లకే ఫేవరిజం చేస్తున్నారు అంటూ పదేపదే ఇతరుల మీద ఏడుస్తూ అనవసర గొడవలకు దిగుతున్నారే తప్ప అసలైన ఆట ఆడటం లేదు. వీళ్లతో షోని నెట్టుకురావడం అయ్యేపని కాదని పసిగట్టిన బిగ్‌బాస్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలను తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో కెవ్వు కార్తీక్‌, భోలె షావళి, పూజా మూర్తి, నయని పావని, అంబటి అర్జున్‌, అంజలి పవన్‌ హౌస్‌లోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ చివరికి అంజలి పవన్‌ హౌస్‌ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. అలాగే మరో కొత్త లేడీ కంటెస్టెంట్‌ కూడా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వనుందని భోగట్టా!

ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ ఎంట్రీపై అంజలి పవన్‌ స్పందించింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్‌కు వెళ్తున్నానా? లేదా? అని చాలామంది అడుగుతున్నారు. బిగ్‌బాస్‌ అనగానే అమ్మో అనిపించింది. ఎందుకంటే, నేను ఇల్లు వదిలి ఎక్కువ రోజులు ఉండలేను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ, తర్వాత పవన్‌.. వీళ్లను వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. ధన్విక పుట్టిన తర్వాత తనే నా ప్రపంచమైపోయింది. తను బెంగ పెట్టుకుంటుందో లేదో కానీ నేను మాత్రం బెంగ పెట్టుకుంటాను. పవన్‌ వెళ్లుంటే బాగుండేది, కానీ నేను వెళ్లాలనేసరికి ఆలోచించాను.

ఎన్నిరోజులు అక్కడ ఉంటామో కూడా తెలీదు కాబట్టి.. అది నాకు సెట్‌ కాదనుకున్నాను. వైల్డ్‌ కార్ట్‌ ఎంట్రీకి అడిగారు.. కానీ ఆట మొదలైన నెల రోజుల తర్వాత హౌస్‌లోకి వెళ్లడం కరెక్టేనా? అక్కడ ఉండగలనా? ఇలా చాలా ప్రశ్నలు లేవనెత్తారు మా ఇంట్లోవాళ్లు. మళ్లీ హౌస్‌లోకి వెళ్లి నెగెటివ్‌ అయి వస్తే బాగోదనిపించింది. అందుకే వెళ్లాలా? వద్దా? అని ఆలోచించి వెనకడుగు వేశాను. ఈ సీజన్‌కు వద్దు అనుకున్నాను. నేను బిగ్‌బాస్‌ 7లో పాల్గొనడం లేదు. ఏమైనా ఉంటే తర్వాతి సీజన్‌లో చూసుకుందాం.. అని చెప్పుకొచ్చింది అంజలి పవన్‌.

చదవండి: డబుల్ షాక్ ఉంటుందా?.. హౌస్‌లో స్టార్‌ హీరోల సందడి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement