
గోరింటాకు సీరియల్‌తో మంచి పేరు సంపాదించుకున్నాడు నిఖిల్. ఇతడు పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోని మైసూర్‌లో.. చిన్నప్పటి నుంచే నటనపై ఇష్టం. అలా 2016లో కన్నడ భాషలో ఊటీ అనే సినిమా చేశాడు. ఇందులో సహాయక పాత్ర పోషించాడు. అనంతరం కన్నడలో మలయే మంత్రాలయ సీరియల్‌లో నటించాడు. తెలుగులో ఛాన్స్ రావడంతో ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు. ఈ మధ్యే ఊర్వశివో రాక్షసివో సీరియల్‌లో అలరించాడు.
కన్నడలో హీరోగా రెండు సినిమాలు చేసిన నిఖిల్‌కు విలన్‌గా కనపడటమే ఎక్కువ ఇష్టమంటున్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్ 8లో సెకండ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన నిఖిల్ తనలో హీరోయిజం చూపిస్తాడా? విలనిజం చూపిస్తాడా? అనేది చూడాలి.. ఇకపోతే నాగ్ అతడిని సింగిల్‌గా లోనికి పంపలేదు. యష్మి గౌడతో కలిసి జంటగా హౌస్‌లోకి పంపించాడు. అదుర్స్ అనిపించేలా ఆటలు ఆడిన నిఖిల్ ఈ సీజన్ విజేతగా నిలిచాడు.