Buzz: Nandamuri Balakrishna Slapped Sreeleela, Details Inside - Sakshi
Sakshi News home page

Sreeleela: శ్రీలీల చెంప చెళ్లుమనిపించిన బాలయ్య, ఏడ్చేసిన హీరోయిన్‌!

Published Fri, May 26 2023 3:44 PM | Last Updated on Fri, May 26 2023 4:14 PM

Buzz: Nandamuri Balakrishna Slapped Sreeleela, Details Inside - Sakshi

ఫస్ట్‌ సినిమాతోనే క్లిక్కవడం, ఆ ఫేమ్‌ను అలాగే కాపాడుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఈ విషయంలో పెళ్లిసందD బ్యూటీ శ్రీలీల మాత్రం సక్సెస్‌ అయిందనే చెప్పాలి. ప్రతి సినిమాకు వంద శాతం న్యాయం చేస్తున్న ఈ కన్నడ బ్యూటీ చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అందులో నందమూరి బాలకృష్ణ మూవీ కూడా ఉంది.

అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! ఇందులో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా శ్రీలీల బాలయ్య మేనకోడలి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దసరాలోపు బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అయితే సెట్‌లో బాలయ్య శ్రీలీల చెంప చెళ్లుమనిపించాడట. సినిమాలోని ఓ సన్నివేశంలో భాగంగానే శ్రీలీలపై చేయి చేసుకున్నాడు.

అయితే ముందుగా శ్రీలలే తనను కొట్టమని అడగడం, బాలయ్య ఆమె చెంప చెళ్లుమనిపించడం, చివరకు ఆమె బావురుమని ఏడ్వడం జరిగిపోయింది. చిత్రీకరణలో భాగంగానే ఈ సంఘటన జరిగినప్పటికీ చిత్రయూనిట్‌ అంతా బిత్తరపోయినట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశం చాలా సహజంగా రావడంతో అందరూ శ్రీలీలను మెచ్చుకున్నారట. ఇదెంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: సత్తిగాని రెండెకరాలు మూవీ రివ్యూ
నటుడి రెండో పెళ్లి.. జీవితమే ఒక పజిల్‌ అంటూ మొదటి భార్య పోస్ట్‌.. వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement