
చెక్ బౌన్స్ కేసులో ‘కొచ్చడైయాన్’ సినిమా నిర్మాతకు గతేడాదిలోనే ఆరు నెలల జైలు శిక్షను చెన్నై అదనపు సెషన్స్ కోర్టు విధించింది. కానీ, అదే సమయంలో డబ్బు చెల్లించేందుకు కొంత సమయం కూడా న్యాయస్థానం ఇచ్చిన విషయం తెలిసిందే.రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 2014లో వచ్చిన 3డీ మోషన్ క్యాప్చర్ మూవీ ‘కొచ్చడైయాన్’. ఈ సినిమా నిర్మాణ పనులకు బెంగుళూరుకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ‘కొచ్చడైయాన్’ నిర్మాణ సంస్థ మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ అధనేతలలో ఒకరైన మురళీ మనోహర్ రూ. 10 కోట్ల రుణం తీసుకున్నారు. అందుకు లతా రజనీకాంత్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
బెంగుళూరుకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అబిర్ చంద్ నహర్‌కు ‘కొచ్చడైయాన్’ నిర్మాత మురళీ మనోహర్ 2014లో రూ. 5 కోట్లకు ఇచ్చారు. అయితే ఆ చెక్కు బౌన్స్ అయింది. దీంతో చిత్ర నిర్మాతపై చెన్నై అల్లికుళంలో ఉన్న కోర్టులో మోసం కేసు దాఖలు చేశారు. అదే విధంగా అబిర్‌చంద్ నహర్‌కి ఇవ్వాల్సిన రూ.5 కోట్లకు ఏడాదికి 9 శాతం వడ్డీ చొప్పున రూ.7.70 కోట్లు ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఆ డబ్బు చెల్లించేందుకు చిత్ర నిర్మాత అంగీకరించడంతో అతనికి బెయిల్ మంజూరు చేయడంతో పాటు ఈ కేసులో స్టే విధించింది.
అయితే, ఇప్పటికీ తనకు రావాల్సిన పూర్తి డబ్బు అందలేదని అభిరచంద్ నహర్ మళ్లీ కోర్టుకు వెళ్లాడు. వడ్డీ కాకుండా అసలుకు సంబంధించే రూ. కోటి ఇవ్వాల్సింది ఉందని ఆయన పేర్కొన్నాడు. దీనిని విచారించిన కోర్టు.. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా చెల్లించకపోతే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. కోర్టు తీర్పును దిక్కారిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment