
సాత్విక్ వర్మ, జాక్ రాబిన్‌సన్, మంజీరా రెడ్డి, అమీర్తా హాల్దర్ హీరో హీరోయిన్లుగా ముత్తు యం. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చిక్లెట్స్’. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసన్ గురు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో రామ్ కార్తీక్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘చిక్లెట్స్’ ట్రైలర్ చాలా బాగుంది.
పిల్లలకు, పేరెంట్స్‌కి మంచి సందేశం ఇచ్చేలా తెరకెక్కిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి’’ అన్నారు. ముత్తు యం. మాట్లాడుతూ– ‘‘1990 జనరేషన్‌కి చెందిన పేరెంట్స్‌కు, 20కె జనరేషన్ పిల్లలకు మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణని ఈ సినిమాలో చూపించాం. ఇందులో లవ్, ఎంటర్‌టైన్మెంట్, ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు. ‘‘తల్లితండ్రులు, పిల్లలకు మధ్య ఉన్న అన్ని భావోద్వేగాలు మా సినిమాలో ఉన్నాయి’’ అన్నారు శ్రీనివాసన్ గురు. లైన్‌ప్రొ డ్యూసర్ డానియల్, దర్శకుడు శివమ్ మాట్లాడారు.