బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన అప్డెట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలు అభిమానులతో పంచుకుంటుంది. ఇక ఇతర విషయాలపై తన అభిప్రాయాలను కూడా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో దీపిక డ్యాన్స్ చేస్తూనే చాలా రకాల మార్పులు చూపించింది. ‘నేను.. నా ఆల్టర్ ఈగోస్’ అంటూ ఈ డ్యాన్స్ వీడియోకి క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక దీపికా పదుకొనె సినిమాల విషయానికి వస్తే... ఈ బ్యూటీ చేతి నిండా పెద్ద మూవీస్ ఉన్నాయి. భర్త రణ్‌వీర్ సింగ్‌తో కపిల్ దేవ్ బయోపిక్ ‘83’, షారుఖ్ ఖాన్‌తో ‘పఠాన్’, హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ మూవీతో పాటు ప్రభాస్-నాగ్ అశ్విన్ చిత్రంలోనూ నటిస్తోంది. ఇక వీటితో పాటు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ‘మహాభారతం’లోనూ ఆమె నటించబోతున్నారని టాక్. ఇందులో ఆమె ద్రౌపది పాత్రలో ఆమె కనిపించనున్నారని వినికిడి.
చదవండి : ‘ధూమ్-4’లో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment