
మంజుమేల్ బాయ్స్.. ఇప్పుడు దక్షిణాది సినిమా పరిశ్రమలో మార్మోగిపోతున్న సినిమా పేరు. ఇది చిన్న బడ్జెట్‌లో రూపొందిన మలయాళ చిత్రం. విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంకా కూడా అనేకచోట్ల సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఒక యధార్థ సంఘటనతో రూపొందించిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకుడు. ఈయన్ని పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు కలిసి మరీ అభినందిస్తున్నారు.
వారిలో హీరో ధనుష్ కూడా ఉన్నారు. ఈయన మలయాళ దర్శకుడు చిదంబరంను ఎంతగానో ప్రశంసించారు. కాగా చిదంబరం తన నెక్స్ట్ మూవీ తమిళంలో ఉండబోతుందని ప్రచారం సాగుతోంది. దీంతో చిదంబరం దర్శకత్వంలో ధనుష్ నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. ప్రముఖ నిర్మాత అన్బు సెళియన్ తన గోపురం ఫిలింస్ పతాకంపై నటుడు ధనుష్ హీరోగా ఓ చిత్రం చేయనున్నారు.
ఈ చిత్రానికి మంజుమేల్ బాయ్స్ చిత్రం ఫేమ్ చిదంబరం దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ దర్శకుడికి ముందుగా రోమియో ఫిలింస్ అధినేత రాహుల్ అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేసినట్లు తెలిసింది. మరి ఈ ఇద్దరు నిర్మాతల్లో చిదంబరం ఎవరికి ముందుగా చిత్రం చేస్తారో చూడాలి. అయినా ఒక్క చిత్రంతోనే ఒక దర్శకుడికి ఇంత డిమాండ్ రావడం అరుదైన విషయమే!
Comments
Please login to add a commentAdd a comment