ముంబై : బాలీవుడ్ నటి దిశా పటాని తండ్రి జగదీష్ పటానీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనతో పాటు ఉత్తరప్రదేశ్ విద్యుత్‌శాఖ విజిలెన్స్ యూనిట్‌లోని మరో ముగ్గురు అధికారులకు సైతం కరోనా సోకింది. ట్రాన్స్‌ఫార్మర్ కుంభకోణం దర్యాప్తు నేపథ్యంలో దిశా తండ్రి జగదీష్ పటానీ సహా మరో ఇద్దరు అధికారులు లక్నో నుంచి ముంబై వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లక్నో విద్యుత్ శాఖ విజిలెన్స్ యూనిట్‌లో దిశా తండ్రి ఎస్పీ హోదాలో పనిచేస్తున్నారు. అయితే దర్యాప్తు నిమిత్తం అక్కడికి చేరుకోగానే పరీక్షలు నిర్వహించగా ముగ్గురు అధికారులకు సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా జోనల్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని 48 గంటల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. (మీడియా వేధింపుల గురించి ముంబై పోలీసులకు లేఖ)
Comments
Please login to add a commentAdd a comment