Alia Ranbir Marriage: Ranbir Mother Neetu Kapoor Confirms Marriage Date And Venue - Sakshi
Sakshi News home page

Neetu Kapoor: లవ్‌బర్డ్స్‌ పెళ్లిపై నోరు విప్పిన రణ్‌బీర్‌ తల్లి నీతూ కపూర్‌

Published Thu, Apr 14 2022 1:02 PM | Last Updated on Thu, Apr 14 2022 1:18 PM

Finally Ranbir Mother Neetu Kapoor Confirms Love Birds Marriage Date, Place - Sakshi

Finally Ranbir Mother Neetu Confirms Marriage Date, Place: బాలీవుడ్‌ లవ్‌బర్ట్స్‌ అలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌లు నేడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఏప్రిల్‌ 14న మధ్యాహ్నం 3 గంటలకు ఈ జంట మూడు మూళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. కాగా గత కొద్ది రోజులుగా ఈ ప్రేమ జంట వివాహం బి-టౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. విక్కీ కౌశల్‌, కత్రీనా మాదిరిగా తమ పెళ్లి విషయంలో రణ్‌బీర్‌-అలియాలు గోప్యత పాటిస్తూ వస్తున్నారు. దీంతో వీరిద్దరి పెళ్లిపై సస్పెన్స్‌ నెలకొంది. ఈ క్రమంలో రణ్‌బీర్‌ సోదరి రిద్ధిమా, తల్లి నీతూ కపూర్‌లు వీరి పెళ్లిపై స్పష్టత ఇచ్చారు. ఈ రోజు వీరిద్దరి పెళ్లి జరనుగున్నట్లు మీడియాతో వారు వెల్లడించారు.

చదవండి: కాబోయే భార్యకు రణ్‌బీర్‌ కాస్ట్‌లీ గిఫ్ట్‌! అదేంటో తెలుసా?

ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ వరింధర్‌ చావ్లా షేర్‌ చేశాడు. ఈ వీడియోలో రిద్ధిమా, నీతూ కెమెరాలకు ఫోజులు ఇచ్చి కనిపించారు. అయితే వారిద్దరు సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకుని కనిపించారు. ఈ సందర్భంగా పెళ్లి ఎప్పుడంటూ మీడియా వారిని ప్రశ్నించగా సమాధానం ఇచ్చేందుకు సంకోచించారు. అయినప్పటికీ మీడియా వారిని రిక్వెస్ట్‌ చేయగా ఎట్టకేలకు ఈ రోజు పెళ్లి అని రిద్ధిమా చెప్పగా.. రణ్‌బీర్‌ నివాసం వాస్తులోనే ఈ వేడుక జరుగనుందని నీతూ కపూర్‌ నోరువిప్పారు. ఇలా చివరకు అలియా-రణ్‌బీర్‌ పెళ్లిపై సస్పెన్స్‌ వీడింది. ​కాగా పెళ్లి వేడుకల్లో భాగంగా బుధవారం ఉదయం రణ్‌బీర్‌–ఆలియా ముందుగా పితృపూజ చేశారట.

చదవండి: జూ. ఎన్టీఆర్‌ తల్లి శాలినిపై యశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ తర్వాత మెహందీ ఫంక్షన్‌  మొదలుపెట్టారు.  బుధవారం రాత్రి సంగీత్‌ ఫంక్షన్‌  జరిగినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఇక నేడు(ఏప్రిల్‌ 14) దాదాపు 50 మంది ఇరు కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లిలో భాగంగా రణ్‌బీర్‌ అలియాకు కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. వజ్రాల బ్యాండ్‌... ఆలియా కోసం రణబీర్‌ ప్రత్యేకంగా ఓ బహుమతి తయారు చేయించారట. 8 వజ్రాలు పొదిగిన ఖరీదైన వెడ్డింగ్‌ బ్యాండ్‌ అది. పెళ్లిలో ఆలియా తన చేతికి ఆ బ్యాండ్‌ ధరించనున్నారు. కాగా కపూర్‌ ఇంటి కుటుంబానికి 8 లక్కీ నంబర్‌ అట. అందుకే కాబోయే శ్రీమతికి ఎనిమిది వ్రజాలు పొదిగిన బ్యాండ్‌ని రణ్‌బీర్‌ బహూకరించనున్నాడని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement