Alia Bhatt And Ranbir Kapoor Marriage Date Confirmed On April 14th, Check Other Special Things - Sakshi
Sakshi News home page

Alia Bhatt Ranbir Kapoor Marriage: కపూర్‌ సాంప్రదాయం.. ఆమె నగలనే ఆలియా వేసుకోనుందట

Published Sat, Apr 9 2022 7:58 AM | Last Updated on Sat, Apr 9 2022 10:29 AM

Ranbir Kapoor Alia Bhatt Wedding Is On April 14, Check Out Details - Sakshi

బీ టౌన్‌లో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా ఆ చర్చల్లో ఓ ప్రధానాంశం రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ల వివాహం గురించే. రణ్‌బీర్, ఆలియా పెళ్లి ఎప్పుడు? ఎలా? ఎక్కడ జరగనుందనే విశేషాలపై సినీ లవర్స్‌ ఆసక్తిగా ఉన్నారు. రణ్‌బీర్, ఆలియా ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. వేడుకలు ఎలా జరగనున్నాయి? పెళ్లి బట్టలు, నగలు వంటి విషయాలు ప్రచారంలోకొచ్చాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం. 

► రణ్‌బీర్, ఆలియా ముందుగా రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలనుకున్నారు. అయితే కపూర్‌ వంశానికి చెందిన పురాతన వారసత్వ నివాసం ఆర్కే హౌస్‌ (ముంబై)లో పెళ్లి చేయాలని కపూర్‌ కుటుంబ పెద్దలు నిర్ణయించారట. 1980లో రణ్‌బీర్‌ తల్లిదండ్రులు నీతూ కపూర్, రిషి కపూర్‌ల వివాహం ఆ ఇంట్లోనే వైభవంగా జరిగింది. రెండేళ్ల క్రితం రిషి కన్నుమూసిన విషయం తెలిసిందే. కపూర్‌ ఇంటి కోడలిగా ఆ ఇంటి సంప్రదాయాలను పాటించే క్రమంలోనే పెళ్లి వేదికగా ‘ఆర్కే హౌస్‌’ని నిర్ణయించారట నీతూ కపూర్‌. 



► పెళ్లికి హాజరయ్యే అతిథుల కోసం రణ్‌బీర్‌ కుటుంబం ముంబైలోని ఓ బాంక్వెట్‌ హాల్‌ను బుక్‌ చేశారట. ఒకేసారి దాదాపు 150 మంది ఈ హాల్‌లో ఉండే సదుపాయం ఉందట.  కానీ రణ్‌బీర్‌ మాత్రం అందర్నీ ఒకేసారి కాకుండా వేరు వేరు సమయాల్లో కలిసేలా ప్లాన్‌ చేశారట. ఈ హాల్‌ చుట్టు పక్కల ఉన్నవారు ఇబ్బంది పడకూడదనే రణ్‌బీర్‌ ఇలా ప్లాన్‌ చేశారన్నది బాలీవుడ్‌ టాక్‌. బ్యాచిలర్‌ పార్టీని కూడా రణ్‌బీర్‌ ఈ హాల్‌లోనే ప్లాన్‌ చేశారట.  



► రణ్‌బీర్, ఆలియా వివాహ వేడుకలు నాలుగు రోజులు జరుగుతాయని టాక్‌. ఏప్రిల్‌ 13న రణ్‌బీర్, ఆలియా పెళ్లి సందడి మొదలవుతుంది. ఆ రోజు మెహందీ ఫంక్షన్‌ జరుగుతుంది. 14న సంగీత్‌ ప్లాన్‌ చేశారు. 15 కూడా ఇదే సందడి కొనసాగుతుంది. ఏప్రిల్‌ 16న  అర్ధరాత్రి తర్వాత రెండు గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల మధ్యలో రణ్‌బీర్, ఆలియా మెడలో మూడు మూడులు వేసి, ఏడడుగులు వేస్తారని బీ టౌన్‌ టాక్‌. ఈ వివాహం బంధువులు, సన్ని హితుల సమక్షంలోనే జరుగుతుంది.  



► పెళ్లికి ముందే కాబోయే కోడలు ఆలియాకు వారసత్వ నగలను ఇవ్వనున్నారు నీతూ కపూర్‌. ఈ నగలు కృష్ణ రాజ్‌ కపూర్‌ (ప్రముఖ నటుడు రాజ్‌ కపూర్‌ భార్య)కు వారసత్వంగా వచ్చినవి. కృష్ణ రాజ్‌ కపూర్‌ అంటే నీతూ కపూర్‌ అత్త, రిషి కపూర్‌ తల్లి. ఇక రణ్‌బీర్, ఆలియాల వెడ్డింగ్‌ డ్రెస్‌లను, నీతూ కపూర్‌ డ్రెస్‌ను బాలీవుడ్‌ ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేశారు.  



► పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోందట ఈవెంట్‌ మేనేజ్‌ మెంట్‌. ఇది అగ్రిమెంట్‌లో భాగమట. ఇటీవల  వివాహం చేసుకున్న విక్కీ కౌశల్‌–కత్రినా కైఫ్, ఆదిత్యా థార్‌–యామీ గౌతమ్‌ల పెళ్లి ఫోటోలకు కూడా ఇలాంటి అగ్రిమెంట్సే జరిగాయని టాక్‌.  



► రణ్‌బీర్‌–ఆలియా హనీమూన్‌కి సింగపూర్‌ వెళతారని వార్తలు వచ్చాయి. అయితే సౌత్‌ ఆఫ్రికా వెళ్లాలనుకుంటున్నారన్నది తాజా టాక్‌. ఈ ఇద్దరి  న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కూడా అక్కడే జరిగాయి. హనీమూన్‌ నుంచి వచ్చాక ఏప్రిల్‌ నెలాఖర్లో ముంబైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలను కుంటున్నారని తెలిసింది.

లక్కీ 8
సంగీత్, మెహందీ తర్వాత 16న రణ్‌బీర్, ఆలియా వివాహం జరగనుందని టాక్‌. ఆ తేదీనే వివాహం చేసుకోవడానికి ఓ కారణం ఉందని బాలీవుడ్‌ అంటోంది. రిషి కపూర్, నీతూ కపూర్, రణ్‌బీర్‌ ‘8’ నెంబర్‌ను లక్కీగా భావిస్తారట. 16.04.2022ని కూడితే 2042. ఈ సంఖ్యను కూడితే రణ్‌బీర్‌ కపూర్‌ లక్కీగా భావించే ‘8’ వస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement