ప్రతి చిత్రానికి ఓ కథ ఉంటుంది. ఆ కథలో ఇంకో కథ కూడా ఉండొచ్చు. అదే ఫ్లాష్‌బ్యాక్. కొన్ని చిత్రాలకు ఈ ఫ్లాష్‌బ్యాక్ ప్రధానాంశంగా ఉంటుంది. అలా ‘కట్ చేస్తే.. కథ వెనక్కి’ అంటూ ఫ్లాష్‌బ్యాక్ ఓ ప్రధానాంశంగా ప్రస్తుతం కొన్ని చిత్రాలు రూపొందుతున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం.
మలి భాగంలో ఫ్లాష్‌బ్యాక్
ప్రభాస్ కెరీర్‌లో రూపొందుతున్న మరో యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా తొలి భాగం ‘సలార్: సీజ్ ఫైర్’ ఈ ఏడాది డిసెంబరు 22 విడుదల కానుంది. ఈ చిత్రంలో మెకానిక్‌గా, అతని తండ్రిగా ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారట. తొలి భాగం మొత్తం కొడుకు పాత్రతో సాగుతుందని, తండ్రి పాత్ర పరిచయంతో సినిమా ముగిసి, మలి భాగంలో ఫ్లాష్‌బ్యాక్‌గా ‘సలార్’ కథ కొనసాగుతుందని టాక్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
పగ.. ప్రతీకారం
దేశంలో విస్మరణకు గురైన తీర ్రపాంతాలు, అక్కడ నివశించే ప్రజల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్. ఇందులో తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఇంట్రవెల్ తర్వాత తండ్రి పాత్రలో ఎన్టీఆర్ గెటప్, ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఈ చిత్రదర్శకుడు కొరటాల శివ తీస్తున్నారని టాక్. అలాగే తండ్రిగా ఎన్టీఆర్ నటించే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఓ హైలైట్‌గా ఉంటాయట. రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుంది. కల్యాణ్ రామ్, కె. హరికష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ తొలి భాగం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.
ఇటు ఆఫీసర్.. అటు ఆటగాడు
ఐఏఎస్ ఆఫీసర్ విధులు, రాజకీయ రంగంలో వారి ్రపాధాన్యత వంటి అంశాల నేపథ్యంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా రామ్‌చరణ్ కనిపిస్తారని తెలుస్తోంది. కథ ప్రకారం సినిమాలో 1920 నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలు ఉన్నాయట.
ఈ సీన్స్‌లో ఓ రాజకీయ పార్టీ క్రియాశీల నేతగా రామ్‌చరణ్ కనిపిస్తారని, ఈ పాత్రకు జోడీగా అంజలి కనిపిస్తారని, ఇదంతా ‘గేమ్ చేంజర్’లోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌గా ఉంటుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇక ఓ ఐఏఎస్ ఆఫీసర్‌గా రాజ్యాంగం ప్రకారం తన విధులు నిర్వర్తిస్తూనే, తండ్రికి అన్యాయం చేసిన కొందరు రాజకీయ నాయకులను దెబ్బతీసేలా రామ్‌చరణ్ వేసే గేమ్ చేంజింగ్ ΄్లాన్ సినిమాలో హైలైట్ అట.
‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఆగస్టులో విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. అలాగే రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇదొక స్పోర్ట్స్ ఫిల్మ్ అని, ఇందులో అన్నదమ్ములుగా రామ్‌చరణ్ నటిస్తారని, ఓ ఆట కోసం దివ్యాంగుడైన అన్న కలను నెరవేర్చే తమ్ముడిగా.. ఇలా రెండు పాత్రల్లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ఆరంభం
కానుందని సమాచారం.
పుష్ప జీవితంలో ఏం జరిగింది?
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన కల్పిత కథ ‘పుష్ప’. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటిస్తున్నారు. ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఇప్పటికే విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇందులో ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్ హెడ్‌గా పుష్పరాజ్ కనిపిస్తారు.
‘పుష్ప: ది రైజ్’కు కొనసాగింపుగా ‘పుష్ప: ది రూల్’ రానున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది.‘పుష్ప ఏం చేసి దుడ్డు సంపాదిస్తున్నాడో సె΄్తాండారు గానీ.. సంపాదించిన దుడ్డు ఏం సేస్తన్నాడో సెప్తన్నారా?’, ‘నా కొడుక్కి గుండె ఆపరేషన్ అంటే పుష్పనే దుడ్డు పంపించినాడక్క.. అందుకే అక్క వీడు బతికున్నాడు’, ‘నా పిల్ల పెళ్లికి పుష్పానే సాయం సేసినాడు..’ అనే డైలాగ్స్ ‘పుష్ప: ది రూల్’ సినిమాలో ఉన్నాయి.
అంటే.. స్మగ్లర్‌లా సంపాదించిన డబ్బుని పుష్ప ఎందుకు దానం చేస్తున్నాడు? పుష్ప ఇలా చేయడానికి అతని జీవితంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి? అనే సన్నివేశాలు ‘పుష్ప: ది రూల్’లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌గా వస్తాయని సమాచారం. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
ఇలా ఫ్లాష్‌బ్యాక్ ప్రధానాంశంగా సాగే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment