'శ్రీకారం' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది | Hero Sharwanand Sreekaram Movie Going To Release on March 11 | Sakshi
Sakshi News home page

రైతుగా శర్వానంద్‌..'శ్రీకారం' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Published Sat, Jan 23 2021 5:59 PM | Last Updated on Sat, Jan 23 2021 7:48 PM

Hero Sharwanand Sreekaram Movie Going To Release on March 11 - Sakshi

యంగ్ హీరో శర్వానంద్‌ హీరోగా నటించిన ‘శ్రీ‌కారం’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. కిశోర్ రెడ్డి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘సందల్లే.. సందల్లే సంక్రాంతి సందల్లే’, ‘బ‌లేగుంది బాలా’ పాటలు  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రైతుగా కనిపించినున్నశర్వానంద్‌కు జోడీగా ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నటించారు. (అదిరిపోయిన శర్వానంద్‌ ‘సంక్రాంతి సందళ్లే’ పాట)

14 రీల్స్‌ ప్లస్‌బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతం సమకూర్చుతున్నారు. సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు అందించగా జే యువరాజ్‌ సినిమాటో గ్రఫి అందించారు. ఈ సినిమాలో రావు ర‌మేష్‌, ఆమ‌ని, సీనియ‌ర్ న‌రేష్‌, సాయికుమార్‌, ముర‌ళీ శ‌ర్మ, స‌త్య, స‌ప్తగిరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. (‘బంగారు బుల్లోడు’ మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement