జాన్వీ కపూర్‌ కొత్త సినిమా ట్రైలర్‌ విడుదల | Janhvi Kapoor Ulajh Official Trailer Out Now | Sakshi
Sakshi News home page

జాన్వీ కపూర్‌ కొత్త సినిమా ట్రైలర్‌ విడుదల

Published Tue, Jul 16 2024 1:37 PM | Last Updated on Tue, Jul 16 2024 1:43 PM

Janhvi Kapoor Ulajh Official Trailer Out Now

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తున్న కొత్త సినిమా 'ఉలాజ్‌' నుంచి తాజాగా ట్రైలర్‌ విడుదలైంది.స్పై థ్రిల్లర్‌ కథతో తెరకెక్కిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నేషనల్ అవార్డ్‌ అందుకున్న  డైరెక్టర్ సుధాంశు సారియా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో జాన్వీ కపూర్‌తో పాటు గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేష్ తైలాంగ్ వంటి వారు నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కానుంది.

దేవర మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా జాన్వీ దగ్గరైంది. అయితే, ఆమె నటించిన ఉలాజ్‌ చిత్రంలో సుహానా భాటియా పాత్రలో మెరిసింది. భారత విదేశాంగ విభాగంలో యంగెస్ట్ డిప్యూటీ హై కమిషనర్‌గా కనిపించనుండటం విశేషం. విదేశాల్లో చదువుకున్న సుహానాకు చిన్న వయసులోనే అత్యంత పెద్ద పదవి దక్కడంతో ఆమెపట్ల కొలీగ్స్ ట్రోల్‌ చేస్తారు.

నెపోటిజం వల్లే ఇంతపెద్ద ఉద్యోగం వచ్చిందంటూ పలు ఆరోపణలు చేస్తారు. ఆమె పేరు చివరలో భాటియా అని ఉండటం వల్ల ఈ పదవి దక్కిందని కామెంట్‌ చేస్తారు. దేశ రక్షణ కోసం పనిచేస్తున్న ఇలాంటి విభాగంలో ఆమె టాలెంట్‌ పనికిరాదని వారు చెబుతున్న క్రమంలో ఆమెకు ఓ అండర్ కవర్ ఏజెంట్ నుంచి   సవాలు ఎదురౌతుంది. ఇలా ట్రైలర్‌లను ఆసక్తిగా కట్‌ చేశారు. తాజాగా విడుదలైన ఉలాజ్‌ ట్రైలర్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement