హిట్‌ సినిమాకు సీక్వెల్‌.. ఆ హీరోతో మరోసారి జోడీ కట్టనున్న నయనతార! | Jayam Ravi, Nayanthara Starrer Thani Oruvan Sequel Announced - Sakshi
Sakshi News home page

హిట్‌ సినిమాకు సీక్వెల్‌.. ఆ హీరోతో మరోసారి జోడీ కట్టనున్న నయనతార!

Published Wed, Aug 30 2023 9:59 AM | Last Updated on Wed, Aug 30 2023 10:11 AM

Jayam Ravi, Nayanthara Starrer Thani Oruvan Sequel Ready - Sakshi

నటుడు జయం రవి, నయనతార కాంబినేషన్‌ సక్సెస్‌ఫుల్‌ అని తనీ ఒరువన్‌ చిత్రంతో నిరూపణ అయ్యింది. ఈ సినిమాలో ఈ జంట మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్‌ అయ్యింది. కాగా జయం రవి, నయనతార మరోసారి తెరపై రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతున్నారన్నది తాజా న్యూస్‌. వీరిద్దరి కాంబోలో ఇరైవన్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్దమవుతోంది. తనీఒరువన్‌ చిత్ర దర్శకుడు మోహన్‌రాజానే ఈ చిత్రాన్నీ తెరకెక్కించనున్నారు.

ఈ విషయాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ అధినేతలు మంగళవారం అధికారికంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ నిర్మాతలే తనీ ఒరువన్‌ చిత్రాన్ని కూడా నిర్మించడం గమనార్హం. కాగా ఈ సంస్థ ప్రస్తుతం విజయ్‌ కథానాయకుడిగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తదుపరి జయం రవి, నయనతార జంటగా నటించే తనీ ఒరువన్‌ –2 సెట్‌ పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారిక పూర్వకంగా వెల్లడించనున్నట్లు ఆ సంస్థ నిర్వాహకురాలు అర్చన పేర్కొన్నారు. కాగా దర్శకుడు మోహన్‌ రాజా కొత్త ఇమేజ్‌ను తెచ్చి పెట్టిన చిత్రం తనీ ఒరువన్‌ అనే చెప్పాలి. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా రూపొందనున్న తనీ ఒరువన్‌ –2పై భారీ అంచనాలు నెలకొన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.

చదవండి: డ్రగ్స్‌ కేసుపై వివరణ ఇచ్చిన వరలక్ష్మీ శరత్‌కుమార్​.. ఆదిలింగం ఎవరంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement