'దేవర'పై అభిమానులు చూపించిన ప్రేమకు రుణపడి ఉంటా: ఎన్టీఆర్ | Jr NTR Interesting Comments On Devara Movie Addresses Fans In Twitter, Post Goes Viral | Sakshi
Sakshi News home page

'దేవర'పై అభిమానులు చూపించిన ప్రేమకు రుణపడి ఉంటా: ఎన్టీఆర్

Published Fri, Sep 27 2024 2:34 PM | Last Updated on Fri, Sep 27 2024 3:34 PM

Jr NTR Comments On Devara Movie

'దేవర' సినిమా విడుదల సందర్భంగా అభిమానులను ఉద్దేశించి తాజాగా జూ ఎన్టీఆర్‌ ఒక పోస్ట్‌ చేశారు. నేడు సెప్టెంబర్‌ 27న దేవర సినిమా బాక్సాఫీస్‌ వద్ద విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన తారక్‌ అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ సినిమాలో దేవర, వర పాత్రల్లో ఎన్టీఆర్ మెప్పించారు.

'నేను ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. నాపై అభిమానులు చూపించే ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. సినిమాపై మీరు చూపుతున్న అభిమానానికి ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. అందరినీ కదిలించేలా భావోద్వేగాలతో పాటు అద్భుతమైన డ్రామా చిత్రంగా కొరటాల శివ తెరకెక్కించారు. మై బ్రదర్‌ అనిరుధ్‌.. నీ మ్యూజిక్‌తో దేవర ప్రపంచానికి ప్రాణం పోశావ్‌.  

నా నిర్మాతలు హరికృష్ణ కొసరాజు గారికి, సుధాకర్ మిక్కిలినేని గారితో పాటు  సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు, సాబు సిరిల్‌ టెక్నీషియన్స్‌ అందరికీ కృతజ్ఞతలు. దేవర విడుదల సందర్భంగా నా అభిమానులు ఏర్పాటు చేసిన వేడుకలు చూసి నా మనసు నిండింది. నా మాదిరే మీరూ  దేవర చిత్రాన్ని చూసి ఎంజాయ్‌ చేయడం సంతోషంగా ఉంది.' అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement